సోనియా ఓటు-పారసత్వం కేసులో సరైన
ఆలోచన లేకుండా ఆదేశాలిచ్చారు
ఢిల్లీ స్పెషల్ కోర్టు స్పష్టీకరణ ఏసీజేఎం
కోర్టు ఉత్తర్వులు రద్దు ఫిర్యాదును తాజాగా
విచారించాలని నిర్దేశం తదువరి విచారణ 29వ తేదీకి వాయిదా
న్యూఢిల్లీ: భారత పౌరసత్వం రాకముందే ఓటర్ల జాబితాలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పేరు చేర్చిన వ్యవహారంలో దిగువ కోర్టు ఉత్తర్వులను ఢిల్లీ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం) సరైన ఆలోచన లేకుండా ఆదేశాలిచ్చారని స్పష్టంచేసింది. సోనియాగాంధీకి 1983లో భారత పౌరసత్వం లభించగా.. 1980 లోక్సభ ఎన్నికల్లోనే న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గ ఓటరుగా ఓటరు. జాబితాలో ఆమె పేరుందని.. ఇదెలా జరిగిందో దర్యాప్తు జరిపించాలని కోరుతూ.. సెంట్రల్ ఢిల్లీ కోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వికాస్ త్రిపారి ఏసీజేఎం కోర్టును ఆశ్రయించారు. అయితే మేజిస్ట్రేట్ ఆ ఫిర్యాదును కొట్టివేశారు. ధ్రువీకరించని 1980 ఓటర్ల జాబితా ఫొటోకాఫీకి ఫొటోకాపీ ఆధారంగా.. నిరాధార ఆరోపణలతో ఫిర్యాదు చేశారని.. మోసం, ఫోర్జరీ వివరాలు అందులో లేవని పేర్కొన్నారు. ఈ ఆదేశాలు యాంత్రికంగా ఉన్నాయని స్పెషల్ కోర్టు జడ్జి విశాల్ గోగ్ని సోమవారం తప్పుబట్టారు. 'కోర్టు ఉత్తర్వులు చట్టబద్దంగా ఉండాలి. వాస్తవాలను తేలికగా తీసుకోకూడదు. సోనియాగాంధీకి భారత పౌరసత్వం రావడానికి మూడేళ్లకు ముందే ఆమె పేరు 1980లో స్యూఢిల్లీ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో చట్టవిరుద్ధంగా చేరిందని.. 1982లో ఆ పేరు తొలగించినా 1983లో మళ్లీ చేర్చారని వికాస్ త్రిపాది కంప్లయింట్ ఇచ్చారు. 1983 ఏప్రిల్ 30న ఆమెకు భారత పౌరసత్వం లభించిందని.. ఓటరు జాబితాలో ఆమె పేరు తిరిగి చేర్చేనాటికి పౌరసత్వం రాలేదని అందులో పేర్కొన్నాను. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఓటరు జాబితా ప్రతి పౌరుడికీ పవిత్రమైనది. దేశంలో అతి శక్తిమంతుడైనా అతి సామాస్య పౌరుడిలా ఓటరు మాత్రమే. ఓటరు జాబితాను తారుమారు చేశారని.. మోసపూరితంగా ఓటరు పేరు చేర్చారని.. పౌరుడు కాని వ్యక్తి పేరు చేర్చారని.. తప్పుడు ధ్రువీకరణలు, తప్పుడు డాక్యుమెంట్లు ఉపయోగించి ఉ ండొచ్చని.. మోసం, ఫోర్జరీ జరిగాయని ఆరోపణలు వచ్చినప్పుడు కోర్టు సహేతుకమైన ఉత్తర్వులివ్వాలి. సోనియాగాంధీ పేరును ఎప్పుడు చేర్చారు.. ఎప్పుడు తొలగించారు.. ఎప్పుడు తిరిగి చేర్చారో కాలక్రమంపై ఎలాంటి చర్చనూ మేజిస్ట్రేట్ రికార్డు చేయలేదు. ఈ ఆరోపణలు గుర్తించదగిన నేరం కిందకు వస్తాయో రావో తేల్చకుండా.. సదరు కంప్లయింట్లో అవసరమైన అంశాలు లేవని తేల్చేశారు' అని ఆక్షేపించారు. 1980నాటి ఓటర్ల జాబితాను వెలికితీసి ఆరోపణలను పరిశీలించాలని.. లేదంటే మోసపూరితంగా సోనియాగాంధీ పేరును అందులో చేర్చడంపై దర్యాప్తునకు ఆదేశించాలని మాత్రమే ఫిర్యాదులో పేర్కొన్నారని గుర్తుచేశారు. ఈ కేసులో న్యాయవరంగా జరిగిన స్పష్టమైన తప్పు కనిపిస్తోందన్నారు. 'తన ఎదుట ఎఫ్ఐఆర్ సమోదుకు ఆదేశం.. సెక్షన్ 223 ప్రకారం ఫిర్యాదుదారు, సాక్షుల వాంగ్మూలాల పరిశీలన అనే రెండు ఆప్షన్లు ఉ న్నా మేజిస్ట్రేట్ పట్టించుకోలేదు. సదరు ఫిర్యాదును పౌరసత్వం వ్యవహారంతో కలిపేశారు. ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చడం.. తొలగించడానికి సంబంధించి ఎన్నికల కమిషన్కు ఉన్న అధికారం.. తప్పుడు డాక్యుమెంట్లతో ఓటు హక్కు పొంద దంపై పోలీసులు దర్యాప్తు జరపకుండా నిషేధిస్తోందని మేజిస్ట్రేట్ ఎలా భావించారో మాకు అంతుచిక్కడం లేదు' అని స్పెషల్ అడ్డ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నాడు. సహేతుక కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పౌరసత్వంరు ఉత్తర్వులు జారీచేసేందుకు వీలుగా త్రిపారి ఫిర్యాదును తిరిగి ఏసీజేఎం కోర్టుకు పంపారు. సదరు కంప్లయింట్్ప తాజాగా వాదనలు వినాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు.