టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్, టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల తాజాగా షేర్ చేసిన బీచ్‌సైడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వివరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. "రోజ్ క్వార్డ్ అవర్స్" పేరుతో ఆమె పంచుకున్న ఈ పిక్స్‌లో అచ్చం దేవకన్యలా మెరిసిపోతూ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సముద్రపు ఒడ్డున, సూర్యాస్తమయ వేళ సాంప్రదాయ చీరకట్టులో ఆమె ఇచ్చిన రాయల్ పోజులు చూసి నెట్ జన్లు ఫిదా అవుతున్నారు. కుర్రకారును కట్టిపడేస్తున్న ఈ లేటెస్ట్ ఫోటోషూట్ ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారింది. తాజా ఫోటోషూట్ కోసం శ్రీలీల షిమ్మరింగ్ పీచ్-రోజ్ పింక్ కలర్ ట్రెడిషనల్ ఎన్సెంబుల్ను ఎంచుకుంది. తేలికపాటి రోజ్ క్వార్డ్ పింక్ జార్జెట్, ఆర్గాంజా చీరపై సిల్వర్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ, అందమైన బార్డర్స్ ఈ డ్రెస్‌కు ప్రత్యేక ఆకర్షణ తెచ్చాయి. ఇక దీనికి తగ్గట్టుగా స్వీట్పోర్ట్ నెక్లెన్ ఉన్న హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధరించి, తలపై చీర కొంగును కప్పుకుని ఎంతో పద్ధతిగా, అందంగా కనిపించింది. ఈ ఎథ్నిక్ లుక్‌ను మరింత హైలైట్ చేస్తూ శ్రీలీల సుదుట మాంగ్ తిక్క చెవులకు సున్నితమైన ఆభరణాలు ధరించింది. బీచీ గోల్డెన్ అవర్ లైటింగ్‌కు తగినట్లుగా సాఫ్ట్ మేకప్ టోన్స్ ఉపయోగించి తన సహజమైన అందాన్ని మరింత మెరిపించింది. ఇక గాలికి ఎగురుతున్న ఆ వస్త్రాలు, ఆమె చిరునవ్వు చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తున్నాయి.