అరాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్ఈసీ ఉత్తర్వులు
తొలుత 19 స్థానాల్లో ఆపాలని భావించిన ఎన్నికల సంఘం చివరకు
13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలపై నిర్ణయం సుప్రీంకోర్టు
ఆదేశాల నేపథ్యంలో కీలక పరిణామం బుధవారం అర్ధరాత్రి
ఉత్తర్వులు జారీచేసిన ఎస్ఈసీ నామినేషన్ల గడువుపై నేడు
నిర్ణయం తీసుకునే అవకాశం జిల్లా కలెక్టర్లు, ఎస్సీల నివేదికల అనంతరం
తదుపరి చర్యలు హఠాత్ పరిణామంపై రాజకీయవర్గాల్లో భిన్న స్పందనలుభ్యర్థుల్లో అయోమయం సర్వత్రా ఉత్కంఠ.
అమరావతి, : ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ చంద్ర వువేనా బుధవారం రాత్రి ప్రకటించారు. 10 స్థానాలకు ఎన్నికలు నిలిపివేయాలని తొలుగ భావించినప్పటికీ, చివరకు 100 చట్టు స్థానిక సంస్థలకు సంబందించిన ఎన్నికల ప్రక్రియను నిలివేస్తున్నట్లు ఎస్ఈసీ పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు. 57 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నిర్వహించ తలపట్టిన సాధారణ ఎన్నిరం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లయింది. ఈ మేరకు ఉ త్తర్వులు విడుదల చేశారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు అదేశాల మేరకు ముందుకెళ్లనున్నట్లు ఎస్ఈసీ తెలిపారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి నివేదికలు వచ్చిన తర్వాత గురువారం తుదవరి ఉ త్తర్వులు జారీచేయన్నట్లు వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి తదుపరి ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీచేశారు. రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం అక్టోబర్ 14న నోటిఫికేషన్లు జారీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్టోబర్ 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ, 19న నామినేషన్ల పరిశీలన పూర్తయినట్లు వివరించారు. నామినేషన్ల దాఖలుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అక్టోబర్ 21న కీలక ఆదేశాలుఇచ్చింది. అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను అక్టోబర్ 25 వరకు వాయిదా వేయాలని ఆదేశించింది. నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, వాటికి సంబంధించిన ఆధారాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను పరిశీలించి గడువు పొడిగించాలా వద్దా అన్నది నిర్ణయిం చాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డంకులు ఎదుర్కొన్న అభ్యర్ధుల విష యంలో గడువు పొడిగింపుపై అక్టోబర్ 22లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. గడువు పొడిగించాలని నిర్ణయిస్తే, ఆ నిర్ణయం ప్రకటించిన సమయం నుంచి కనీసం 48 గంటల పాటు ఆద నపు గడువు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణం గా ఎన్నికల నోటిఫికేషన్ ను సవరించాల్సి ఉంటుందని పేర్కొంది.
కలెక్టర్లు, పోలీసు అధికారుల నివేదికల
ఆధారంగా తదుపరి చర్యలు
సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసే క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో తదుపరి ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్ల నుంచి నివేదికలు సేకరించిన అనంతరం అక్టోబర్ 22న తడువరి ఉత్తర్వులు జారీ చేయ నున్నట్లు పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలుకు ఎదురైన ఇబ్బందులు, చట్టం- శాంతిభద్రతల పరిస్థితులు, అభ్యర్థులు సమర్పించిన ఫిర్యాదులు తదితర అంశాలను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఎన్నికల అధికారులకు ఆదేశాలు
రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లు, సంబంధిత రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల అధికారులకు పంపించారు. ఈ ఉత్తర్వుల ప్రతులను రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్, పురపాలక పరిపాలన శాఖ ఉ న్నతాధికారులు, సాధారణ వరిశీలకులు, వ్యయ పరిశీలకులకు కూడా పంపారు.
తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంతో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల తదువరి షెడ్యూల్‌పై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 22న అధికారుల నివేదికలను పరిశీలించిన అనంతరం ఎన్ని కల సంఘం తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. అవసర మైన చోట్ల నామినేషన్ల గడువు పొడిగిస్తారా, ఎన్నికల నోటిఫికేషన్లో మార్పులు చేస్తారా, తదుపరి ప్రక్రియను ఎలా కొనసాగిస్తారనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈనెల 21న జారీ చేసిన ఉ త్తర్వుల ప్రకారం ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. తదుపరి చర్యలపై అక్టోబర్ 22న ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల గడువు పొడిగింపుపై పరిశీలన చట్టపరమైన, శాంతిభద్రతలకు సంబంధించిన పరిస్థి తుల కారణంగా కొందరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారా అనే అంశాన్ని పిటిషనర్ పార్టీతో పాటు వివిధ అభ్యర్థు లు సమర్పించిన వినతులు, వాటికి సంబంధించిన ఆధా రాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. అవసరమని భావించిన పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్ల దాఖలు గడువును పొడిగించాలా. లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. ఈ విషయం పై గురువారం సాయంత్రం లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నామినేషన్ల గడువును పొడిగించాలని నిర్ణయిస్తే, ఆ నిర్ణయం ప్రచురించిన సమయం నుంచి కనీసం 48 గంటలకు తగ్గకుం డా అదనపు గడువు ఇవ్వాలని, అందుకు ఎన్నికల నోటిఫికేష స్ ను సవరించాలని కూడా న్యాయస్థానం సూచించింది.
ఎన్ఎసీ, నో డ్యూ సర్టిఫికెట్లపై స్పష్టత
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) నోడ్యూ సర్టిఫికెట్ సమర్పించాలంటూ కొందరు. రిటర్నింగ్ అధికారులు (ఆర్టీఓలు), ఎన్నికల అధికారులు (ఈఆర్డీఓలు) నిబంధనలు విధిస్తున్నారని కొన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చాయి. ఈ అంశంపై స్పష్టతనిస్తూ, అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే సమయంలో తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, నో డ్యూ సర్టిఫికెట్ సమర్పించాలనే నిబంధన ఎన్నికల నియమావళి లో లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అదనపు నిబంధనలు విధించకుండా, అర్హులైన అభ్యర్థులు నిబంధనల ప్రకారం నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ఎన్నికల సంఘం సంఘం సూచించింది..