భారత్, జపాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఈ మైత్రిని మరింత బలోపేతం చేసే దిశగా ఒక చారిత్రక క్రికెట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. భారత్, జపాన్ దేశాల పురుషుల జట్ల మధ్య ఈ నెలలో ఒక ప్రత్యేక టీ20 అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. 'సుజుకి కప్' 'పేరుతో జరగనున్న ఈ మ్యాచ్‌కు సెప్టెంబర్ 22న జపాన్ లోని టోచిగి ప్రిఫెక్చర్లో ఉన్న సానో అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత ప్రధాని సరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని సనే తకైచి మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశంలో కుదిరిన 'స్పోర్ట్ 75' ఒప్పందంలో భాగంగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాలను, సాంస్కృతిక సహకారాన్ని ప్రోత్సహించడమే ఈ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ చారిత్రక మ్యాచ్పి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. "ఈ చారిత్రక ఘట్టంలో భాగం కావడం బీసీసీఐకి ఎంతో ఆనందంగా ఉ ంది. ఇది క్రికెట్‌కు చాలా ముఖ్యమైన క్షణం. భారత జట్టును జపానకు తీసుకెళ్లడం ద్వారా తూర్పు ఆసియాలో ఈ క్రీడను విస్తృత ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం లభిస్తుంది" అని ఆయన తెలిపారు. భారత్-జపాన్ మధ్య బలమైన స్నేహ బంధం ఉందని, ఈ వేడుకల్లో క్రికెట్‌ను భాగం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సంప్రదాయ దేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను విస్తరించే బాధ్యత తమపై ఉ ందని, ఈ దిశగా జపాన్ క్రికెట్ అసోసియేషన్ (జేసీఏ) తో కలిసి పనిచేస్తామని సైకియా వివరించారు. మరోవైపు, జపాన్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నవోకి మియాజీ మాట్లాడుతూ, "ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లను జపాన్‌లో మా సొంత గడ్డపైకి ఆహ్వానించడం మా అసోసియేషను ఒక చారిత్రక ఘట్టం. ఈ లక్ష్య సాధనకు సహకరించిన బీసీసీఐకి ధన్యవాదాలు" అని అన్నారు. భారత క్రికెట్ అభిమానుల ఉత్సాహానికి స్వాగతం పలుకుతున్నామని, స్థానిక జవనీయులు కూడా పెద్ద సంఖ్యలో పచ్చి తమ జట్టును ప్రోత్సహించాలని కోరారు. ఈ మ్యాచ్‌కు అభిమానుల తాకిడి అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్న నిర్వాహకులు, సానో మైదానం సామర్థ్యాన్ని 500 నుంచి 2,000కు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే అధికారిక సోషల్ మీడియా ఛానెళ్లలో టెకెట్ల అమ్మకాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 24 నుంచి జపాన్‌లో ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు అక్కడికి వెళుతున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక మ్యాచ్‌ను ఏర్పాటు చేశారు. ఆసియా క్రీడల కోసం భారత జట్టుతో పాటు నెట్ బౌలర్లుగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ విక్కీ ఓస్వాల్, పేసర్లు రసఖ్ సలామ్, కార్తీక్ త్యాగి కూడా జపాన్‌కు వెళ్లసున్నారు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధివతి వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో ఉన్న ఈ ముగ్గురు యువ బౌలర్లకు ఇది మంచి అవకాశమని, వారి పాస్‌పోర్ట్, వీసా ప్రక్రియలు కొనసాగుతున్నాయని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు ఐఏఎన్ఎస్ తస కథనంలో పేర్కొంది.