మోదీ.. సరైన నాయకుడు 25 ఏళ్లుగా
ప్రభుత్వాధినేతగా ఉండడం మామూలు విషయం కాదు..
దేశాన్ని ప్రగతి దిశగా నడుపుతున్నారు
జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు
మేకిన్ ఇండియాను బలోపేతం చేశారు
నదుల అనుసంధానం ఆయనతోనే సాధ్యం
మహిళలకు 33శాతం కోటా..
గేమ్ చేంజర్ ఏపీకి కేంద్రం నుంచి పెద్దఎత్తున సహకారం
అమరావతి : 'సుస్థిరతతో నమ్మకం పెరుగుతుంది. నమ్మకంతో పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడుల పల్ల ఉద్యోగాలు సమకూరుతాయి. అభివృద్ధి జరుగుతుంది' అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీని దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడిగా అభివర్ణించారు. మోదీ పాతికేళ్ల ప్రజాప్రస్థానాన్ని పురస్కరించుకుని గురువారం వారాణసీలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన 'వారాణసీ-వడ్నగర్ సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. దేశాన్ని మోదీ అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా జాతి ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఆయనకు ప్రతి ఒక్కరూ అందగా నిలవాలని తన ప్రసంగంలో పిలుపిచ్చారు. కాశీ పుణ్యక్షేత్రం మోడీ కర్మభూమి అని.. వారాణసీకి నేతను ఎన్నుకోవడమే కాదు... దేశానికి ఓ గొప్ప నాయకుడిని అందించిందని తెలిపారు. 'వీకేఎస్ అనేది అభివృద్ధి మంత్రం.. ఈ మంత్రంతో దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతోంది. వీ అంటే వడ్నగర్.. కే అంటే కాకీ.. ఎస్ అంటే సెప్టెంబరు' అని చెప్పారు. ఎన్డీఏ ఐక్యతే దేశానికి బలమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం పెద్దఎత్తున సాయం అందిస్తోందన్నారు. అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు ఇస్తున్న మద్దతును రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరువలేరని తెలిపారు. దేశంలో భిన్న సంస్కృతులు, భిన్న భాషలు ఉన్నా.. దేశాభివృద్ధి, ఆత్మనిర్భరతే మన లక్ష్యమన్నారు. సుస్ధిరత వల్లే ఇది సాధ్యమవుతుందని స్పష్టంచేశారు.
ప్రపంచం సంక్షోభంలో కూరుకుపోతున్న వేళ
మోదీ ప్రభుత్వ విజయాలను చంద్రబాబు వివరించారు. 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని.. 80 కోట్ల మంది ప్రజలకు ఉ చితంగా ఆహార ధాన్యాలు అందుతున్నాయని చెప్పారు. 'జల్ జీవన్ మిషన్, అమృత్ వంటి వథకాల ద్వారా 4 కోట్ల ఇళ్లకు తాగునీటి సౌకర్యం కల్పించారు. ఇవి అంకెలు మాత్రమే కాదు.. వీటి వెనుక పేద, మధ్య తరగతి కుటుంబాల అభివృద్ధి-సంక్షేమం ఉంది. పీఎం కిసాన్ కింద 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇందులో ఎలాంటి మధ్యవర్తులూ లేరు. నేరుగా రైతుల ఖాతాలకే నగదు జమ చేస్తున్నారు' అని తెలిపారు. ప్రపంచంలో వివిధ దేశాలు సంక్షోభంలో కూరుకుపోతున్న వేళ నరేంద్ర మోడీ దేశానికి మంచి నాయకత్వం అందించారని.. ఆత్మనిర్భర్ భారత్ , వోకల్ ఫర్ గ్లోబల్ విధానాలతో మేకిన్ ఇండియా కానట్సప్టను బలోపేతం చేశారని ప్రశంసించారు. 'గతంలో రక్షణ పరికరాలను దిగుమతి చేసుకునేవాళ్లం, ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి చేరాం. టెక్నాలజీని పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న ఏకైక ప్రధాని మోదీయే. మహిళా సంక్షేమం, సాధికారత కోసం ఆయన కృషి అపూర్వం.. బేటీ బచావో-బేటీ పడావో, లభ్యతి దీదీ స్క్రీంలు ఇందుకు నిదర్శనం. ఉజ్వల పథకం ద్వారా క్లీన్ ఫ్యూయల్న ప్రోత్సహిస్తున్నారు. ముద్ర పథకం పెట్టుబడులు నమకూరుస్తోంది. స్వయం సహాయక సంఘాలు నమ్మకాన్ని పెంచుతున్నాయి. నారీశక్తి అధినియం ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వబోతున్నారు. ఇది గేమ్ చేంజర్ కాబోతోంది' అని చెప్పారు.
వన్ గ్రిడ్ వన్ నేషన్ మోదీ ఘనతే
దేశం మొత్తానికి ఒకే పవర్ గ్రీడ్ ఏర్పాటు చేసిన మనత మోడీదేనని సీఎం పేర్కొన్నారు. 'దేశం నలుమూలలకూ కనెక్టివిటీ పెంచారు. వందే భారత్ రైళ్లను ప్రారంభించారు.. బుల్లెట్ ట్రైన్లు రాబోతున్నాయి. నదుల అనుసంధానం మాత్రం పెండింగ్‌లో ఉంది.. ఇది కూడా మోదీ ద్వారానే సాధ్యమవుతుంది. బ్రహ్మపుత్ర, గంగ, మహానది, కావేరి, గోదావరి నదులను అనునంసంధానం చేస్తే దేశానికి తిరుగుండదు. మోదీ సారథ్యంలో అభివృద్ధి పట్టణాలకే కాదు.. గ్రామీణ ప్రాంతాలకూ చేరింది' అని తెలిపారు. ప్రపంచం ముందు భారత్‌ను తిరుగులేని శక్తిగా నిలబెట్టిన ఘనత మోదీదేనన్నారు. ఎవరైనా మన దేశంపై దాడి చేయాలంటే భయపడేలా చేశారని తెలిపారు. 'నేను కూడా నక్సలిజాన్ని ఎదుర్కొన్నాను.. నన్ను నక్సలైట్లు టార్గెట్ చేశారు.. కానీ ఇప్పుడు దేశంలో నక్సలిజం, మావోయిజం అనేదే లేకుండా చేశారు. దటీజ్ నరేంద్ర మోదీ. అని చెప్పారు.
కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు
కాశీవిశ్వనాథుడిని చంద్రబాబు దర్శించుకున్నారు. యోగి ఆదిత్యనాథ్, రాజ్‌నాథ్, చిరాగ్ పాసవాస్తో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వనాథుడిని పవిత్ర జలాలతో అభిషేకించారు. అర్చకులు ఆశీర్వదించి.. తీర్థప్రసాదాలు అందించారు. కేంద్ర మంత్రులు, యూపీ సీఎంతో కలిసి ఆలయ ప్రాంగణంలోని భక్తులకు సీఎం ప్రసాదం పంచారు. ఆయన వెంట ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీశ్ ఉన్నారు.
హిందీలో ప్రారంభించి.. హిందీలోనే ముగించారు..!
'ఆజ్ మై కాశీకే పవిత్ర ధర్తీ వర్ బడా హూ.. యే మేరేలియే గర్వ్ కా క్షణ్ హై' అంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 'దేశ్ బదల్ రహా హై, దేశ్ ఆగే బద్ రహా హై.. నయా భారత్ హై.. ఆత్మ నిర్బర్ 'భారత్ హై' అంటూ నినదించారు. 'ఏక్ భారత్, శ్రేష్ భారత్, వికసిత్ భారత్.. యహీ హమారా సంకల్ప్ హై అంటూ ప్రసంగం ముగించారు.
కష్టసుఖాల్లో బాబు తోడు: చిరాగ్
చంద్రబాబు తన తండ్రి రామ్‌విలాస్ పానవాన కు అత్యంత సన్నిహితుడని కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్ అన్నారు. కష్టసుఖాల్లో తన తండ్రికి తోడుగా నిలిచారంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు.
వెరీ వెల్ అంటూ రాజానాథ్ ప్రశంనలు
వారాణసీ-వడ్నగర్ సేవా సంకల్ప్ అభియాన్‌లో సీఎం ప్రసంగానికి మంచి స్పందన లభించింది. రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ చప్పట్లతో మార్మోగింది. రామజన్మభూమి మొదలుకొని ఆపరేషన్ సింధూర్ వరకు ప్రతి అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రసంగం ముగిసిన వెంటనే రక్షణ మంత్రి రాజ్నాథ్్సంగ్ 'వెరీ వెల్.. వెరీ వెల్' అంటూ ప్రశంసించారు. చప్పట్లతో అభినందనలు తెలుపాలంటూ సభికులను కోరారు. సేవా అభియాన్‌లో చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మోదీకి బాబు, పవన్, లోకేశ్ శుభాకాంక్షలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఎక్స్‌లో... 'గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి భారత ప్రధాని వరకు మోదీ 25 ఏళ్లుగా నిరంతరాయంగా ప్రజాసేవ చేస్తున్నారు. మోదీ విప్లవాత్మక నాయకత్వం వల్ల దేశం అభివృద్ధి పథంలో కొత్త వేగం పుంజుకుంది. మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యంతో దేశసేవలో నిమగ్నమవ్వాలని వెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నా' అని పేర్కొన్నారు. పవన్ ఎక్స్‌లో స్పందిస్తూ... ప్రధాని మోదీ తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. ఆయన సేవా ప్రస్థానం దేశ ఆకాంక్షలకు రూపునిస్తుంది. 25 సంవత్సరాల నిస్వార్ధ సేవతో పాటు మరింత కాలం దేశానికి సేవ చేసేందుకు సంసిద్ధమైన ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు, ఆంధ్రప్రదేశ్‌కు మోదీ అందించిన, అందిస్తున్న మద్దతు అమూల్యమైనది. ప్రధాని మోదీ మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును పొందాలి'. అని ఆకాంక్షించారు. మంత్రి లోకేశ్.. మోదీకి వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉ ండపల్లి నివాసంలో 'నమో జయీభవ' అంటూ ఆక్వీరాద దీవం వెలిగించి ప్రధానికి, లోకేశ్ జన్మదిన శు భాకాంక్షలు తెలిపారు.