ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
రాష్ట్ర అభివృద్ధిపై ప్రధానితో కీలక చర్చలు
పోలవరం, గోదావరి పుష్కరాలపై చర్చ
ఎల్ నినో ప్రభావాన్ని వివరించిన సీఎం
నదుల అనుసంధానంపై ప్రతిపాదనలు
పోర్టుల అభివృద్ధికి 20 వేల ఎకరాలివ్వండి
20,378 ఎకరాల భూములు కేటాయించాలి
పంటల ఎగుమతులకు సహకరించాలి.
పీయూష్ గోయల్ తో సీఎం చంద్రబాబు భేటీ
మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహకరించండి
ఓఆర్ఆర్, పోలవరం బ్రిడ్జికి అనుమతివ్వండి
ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సహకరించండి
పోలవరంవద్ద ఐకానిక్ వంతెనకు నిధులివ్వండి
బీచ్ రోడ్ ప్రాజెక్టుపై కేంద్రం దృష్టి సారించాలి
మంత్రి నితిన్ గడ్కరీతో ఖేటీలో సీఎం వినతి
కేంద్రానికి సీఎం చంద్రబాబు పలు విజ్ఞప్తులు
న్యూఢిల్లీ, : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (అక్టోబర్ 08) ఢిల్లీలో ప్రధానమంత్రి సరేంద్ర మోడితో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి, నీటిపారుదల, మౌలిక వసతులు, కరువు పరిస్థితులు సహా పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గోదావరి-- కావేరి నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం చౌరప తీసుకోవాలని కోరారు. భేటీ సందర్భంగా ప్రధానమంత్రి సరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మోదీ అందించిన సేవలను ప్రస్తావిస్తూ.. దూరదృష్టి, నిర్ణయాత్మక నాయకత్వం, నువరిపాలనతో దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలను భాగస్వాములుగా చేసుకుని వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశాన్ని నడిపిస్తున్నారని చంద్రబాబు అభినందించారు. గోదావరి వరద జలాల్లో కొంత భాగాన్ని సమర్ధంగా వినియోగించి దక్షిణాది రాష్ట్రాల నీటి అవసరాలను తీర్చేలా నదుల అనుసంధానంపై సాంకేతిక అధ్యయనం చేపట్టాలని చంద్రబాబు ప్రతిపాదించారు. గోదావరి--కావేరి అనుసంధానం పూర్తయితే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ప్రస్తుతం గోదావరి నుంచి సముద్రంలోకి భారీగా నీరు వెళ్లిపోతున్న నేపథ్యంలో ఈ నీటిని సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించే మార్గాలను పరిశీలించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, నిర్మాణం, పునరావాస వనులపైనా చంద్రబాబు వివరాలు అందించారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాష్ట్రంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని ప్రధానిని కోరారు. 2027 గోదావరి పుష్కరాలు జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఘాట్లు, రహదారులు, పారిశు ద్ధ్యం, భద్రత తదితర మౌలిక వసతులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం లోటు ఏర్పడి వ్యవసాయ రంగంపై ప్రభావం పడిందని చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. 2026 బరీఫ్ సీజన్లో 21 జిల్లాల్లోని 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్ నుంచి ఆగస్టు మధ్య సాధారణ వర్షపాతంతో పోలిస్తే 53.4 శాతం లోటు నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కరువు నివారణ, రైతులకు ఉపశమన చర్యల కోసం ప్రత్యేక కేంద్ర సాయం అందించాలని సీఎం కోరారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, విశాఖ మెట్రో రైల్, బీచ్ కారిడార్ వంటి కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, ఆర్ధిక సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. విశాఖ మెట్రో, బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదం కోసం ప్రధాని వద్ద ప్రతిపాదనలు ఉంచనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అదే సమయంలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్, వ్యవసాయ రంగంలో కొత్త సంస్థల ఏర్పాటు, బాహ్య సహాయంతో అమలవుతున్న ప్రాజెక్టులకు కేంద్ర వాటా వంటి అంశాలపైనా సీఎం చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ఈ భేటీలో.. ముఖ్యంగా నీటి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారంగా గోదావరి-కావేరి అనుసంధానానికి కేంద్రం నుంచి వచ్చే స్పందనపై ఆసక్తి నెలకొంది.
అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో పోర్టు ఆధారిత పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని సుమారు 20,378 ఎకరాల ఉప్పు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురోభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం పరిధిలో ఉన్న ఉప్పు భూములను రాష్ట్రానికి కేటాయించడం ద్వారా పోర్టుల విస్తరణ, అనుబంధ మౌలిక సదుపాయాల కల్పన సులభతరం అవుతుందని ముఖ్యమంత్రి వివరించారు. పోర్టు ఆధారిత పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం ఈ భూములను వినియోగించుకోవడానికి వీలుగా బదలాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. పోర్టులకు అవసరమైన కనెక్టివిటీ రోడ్లు, రైల్వే లైన్లు, ఇతర పారిశ్రామిక కార్యకలాపాలకు ఈ భూములు అత్యంత కీలకమని, దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వంపామని ఆయన గుర్తుచేశారు. ఇదే సమావేశంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలపైనా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో రైతులు పండిస్తున్న మిర్చి, పొగాకు, ఆక్వా వంటి వాణిజ్య ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో విశేషమైన ఆదరణ ఉ ందని, వాటి ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ తగిన సహకారం అందించాలని కోరారు. ఈ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ అవకాశాలను కల్పించడంతో పాటు, నాణ్యతా ప్రమాణాల పెంపుదల, ప్రాసెసింగ్ నదుపాయాలు బలోపేతానికి కేంద్రం చేయూతనివ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్ధనలపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు, నిధులు, అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ ఆయన విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ప్రధానంగా, రాజధాని అమరావతి అభివృద్ధికి గుండెకాయ వంటి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 189 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన ఈ ఓఆర్ఆర్, రాజధాని ప్రాంత అభివృద్ధిలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. అమరావతి, విజయవాడ వరిసర ప్రాంతాల్లో భవిష్యత్తులో పెరిగే రవాణా అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని ఆయన కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడే మరికొన్ని కీలక ప్రాజెక్టులను కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్ర జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టు వద్ద ఎడమ, కుడి గట్లను అనునంధానిస్తూ ఒక 'ఐకానిక్' వంతెన నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. ప్రాజెక్టుకు అనుబంధంగా అవసరమైన రహదారులు, ఇతర వంతెనల నిర్మాణానికి సైతం కేంద్రం తోడ్పాటునందించాలని విన్నవించారు. రాష్ట్ర తీరప్రాంత అభివృద్ధికి, పర్యాటక, పారిశ్రామిక కనెక్టివిటీని పెంచేందుకు బీచ్ రోడ్ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించాలని చంద్రబాబు కోరారు. ఈ రహదారి నిర్మాణం ద్వారా తీరప్రాంత నగరాలు, ఓడరేవులు, పర్యాటక కేంద్రాల మధ్య అనుసంధానం మరింత మె-రుగుపడుతుందని ఆయన వివరించారు.