పునరావాసం, భద్రత, జీవన ప్రమాణాలు,
గృహ వసతులపై ప్రత్యేక దృష్టి సవాళ్లను అధగమించి
సుస్థిర సమాజ నిర్మాణం వైపు ముందడుగు
మేధోమథనానికి వేదికగా ఎస్పీఏలో ప్రత్యేక సమావేశం
విజయవాడ : సగరంలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల క్షేమం, సంక్షేమం, జీపస ప్రమాణాల మెరుగుదల, పునరావాసం, పట్టణ గృహ వసతులపై సమగ్ర కార్యాచరణతో ముందడుగు వేయాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. ప్రజలకు సురక్షితమైన, సుస్థిరమైన నివాస పనతి కల్పించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. గురువారం నగరంలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎన్పీఏ) సమావేశ మందిరంలో ఎస్పీఏతో పాటు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్ సీఐ-హైదరాబాద్), జిల్లా అధికార యంత్రాంగం, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి చొరవతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఏఎస్సీఐ డైరెక్టర్ జనరల్ డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, చెన్నై స్మార్ట్ సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజు, ఎస్పీఏ డైరెక్టర్ డా. రమేష్ సిరికొండ తదితరులు హాజరైన ఈ సమావేశంలో తొలుత ధ్యానచంద్ర హెచ్ఎం నగరంలోని ఇంద్రకీలాద్రి హిల్, విన్నీపేట హిల్, గుణదల హిల్, గాంధీ హిల్ తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలు, కల్పిస్తున్న సౌకర్యాలు, వర్షాలు, వరదల సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఇటీవల కాలంలో చోటుచేసుకున్న ప్రమాదాలు తదితరాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 192 మైక్రో పాకెట్ల పరిధిలో దాదాపు రెండు లక్షల జనాభాకు కల్పిస్తున్న తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ప్రాథమిక మౌలిక వనతుల కల్పనతో పాటు జీవన ప్రమాణాల మెరుగుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. చినుకుపడితే చాలు కొండప్రాంతాల్లోని 48 సున్నిత ప్రాంతాల్లో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోసన్న భయాందోళన పరిస్థితులకు చెక్ పెట్టేందుకు ఓ గొప్ప ముందదుగు వడాల్సిన ఆవశ్యకతను సమావేశంలో ప్రముఖులు ఉద్ఘాటించారు. నవాళ్లను ఎదుర్కొంటూ సగరాన్ని ఆదర్శ సగరంగా నిలబెట్టేందుకు సమష్టి కృషి అవసరమని పేర్కొన్నారు. ఏదైనా రాత్రికి రాత్రే సాధ్యపడదు.. ప్రజల భద్రత, సంక్షేమం, జీవన ప్రమాణాలకు సంబంధించిన కీలక అంశాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమగ్ర ప్రణాళిక, అన్ని శాఖల సమస్వయం, దశలవారీ కార్యాచరణ అవసరమని.. ప్రజల అవసరాలను వరిగణనలోకి తీసుకుని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు సాగుతామని, తాత్కాలిక చర్యలకు పరిమితం కాకుండా, భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే స్థిరమైన పరిష్కారం అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకు ఆధునిక సాంకేతికత, వనరుల సమర్థ వినియోగం, ఆర్బన్ హౌసింగ్ వినూత్న ప్రణాళికలు పంటివి దోహదం చేస్తాయన్నారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి మొదలయ్యే కార్యాచరణపైనా సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఐ సాఫ్టిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.