నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ నామినేషన్
కేంద్రాల్లో సీసీ కెమెరాలు.. అవసరమైన చోట్ల
డ్రోన్లతో నిఘా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు
తిరుపతి, : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధమైందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉ ల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో గురువారం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి జి. సరసింహులుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం తొలుత మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనట్లు కలెక్టర్ తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు వెంకటగిరి, వుత్తూరు, సూళ్లూరుపేట నాయుడుపేట మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించను స్నట్లు తెలిపారు. మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వార్డు సభ్యుల పదవులకు వేర్వేరుగా నామినేషన్లు స్వీకరించేలా ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్థులు తమకు సంబంధించిన నామినేషన్ కేంద్రాలను ముందుగానే గుర్తించి, నిర్ణీత సమయంలోగా చేరుకోవా లని సూచించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వచ్చే నామినేషన్లను స్వీకరించబోమని స్పష్టం చేశారు. ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద బారికేడ్లు, వాహనాల నియంత్రణ, అభ్యర్థులు, ప్రతిపాదకుల ప్రవేశానికి ప్రత్యేక మార్గదర్శకాలు అమలు చేయసున్నట్లు తెలిపారు. నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు సీసీటీవీ కెమెరాలు, వీడియోగ్రఫీ ఏర్పాటు చేయడంతో పాటు అభ్యర్థుల సందేహాల నివృత్తికి సహాయ కేంద్రాలను అందుబాటులో ఉంచుతామన్నారు. జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీలు, వార్డులు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను నిబంధనల మేరకు పారదర్శకంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఎస్సీ, ఎస్టీ, వీసీ వర్గాల జనాభా గణాంకాలు, రిజర్వేషన్ నిబంధనలు, రొటేషన్ విధానాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల కానుండగా, గ్రామ పంచాయతీ ఎన్నికలకు మూడు విడతల్లో నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. తదనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. మున్సివల్ ఎన్నికలకు ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన, 21న నామినేషన్ల ఉపసంహరణ చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామన్నారు. ఈ నెల 28న పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు , 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉ ంటుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్థిర , నిఘా బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించే అధికారులు, రాజకీయ నాయకులు, అభ్యర్థులు, ఇతర వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రిటర్నింగ్ అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి రానున్న వారంలో నమగ్ర శిక్షణతో పాటు క్షేత్రస్థాయి అవగాహస కల్పించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన స్ట్రాంగ్లూమ్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్వీకరణ, వంపిణీ కేంద్రాలను ముందుగానే గుర్తించి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా కేంద్రాల పద్ద జిల్లా పోలీసు యంత్రాంగం, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. కలెక్టర్ట్, జిల్లా పంచాయతీ కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయం, ఆర్టీఓ కార్యాలయాలు, మండల స్థాయిలో నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 20 వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఎన్నికల విధులకు, ఉ త్సవాల నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. గత పది రోజులుగా ఉన్నతాధికారులు, మండల స్థాయి అధికారులతో నమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల సన్నద్ధతను సమీక్షించినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ, పట్టణ స్థానిక సంస్థలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ స్వేచ్ఛాయుత, నివృక్షపాత ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు ఏర్పాటు చేసిన బృందాలు, నిఘా బృందాలు, ప్లయింగ్ స్క్వార్డ్లను ఇప్పటికే విధుల్లోకి పంపినట్లు చెప్పారు. నామినేషన్ కేంద్రాల వద్ద అవసరమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తూ రిటర్నింగ్ అధికారులతో నమస్వయం చేసుకుంటున్నామన్నారు. కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగిస్తామని, అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించి భద్రతను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం వరకు అమలు చేయాల్సిన భద్రతా చర్యలపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎస్పీ తెలిపారు. పోలీసు బలగాల పంపిణీ, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల భద్రత, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు, రవాణా మార్గాల్లో నిఘా వంటి అంశాలను నిరంతరం సమీక్షిస్తున్నామన్నారు. పోలింగ్ కేంద్రాలు, బూత్‌ల వరిసరాల్లో అవసరమైన మేరకు పోలీసు బలగాలను మోహరించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సామగ్రి వంపిణీ, స్వీకరణ కేంద్రాలు, రవాణా మార్గాలు, మొబైల్ పోలీసు బృందాలకు తగిన భద్రత కల్పిస్తామన్నారు. ఎన్నికల సమయంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని ఎస్పీ తెలిపారు. రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, పోలీసు, ఎన్నికల అధికారులకు సహకరించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్, ఎస్పీ విజ్ఞప్తి చేశారు.