ప్రతి ఓటరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, : జిల్లాలో మున్సిపల్, ఎంపీటీసీ, కెడ్పీటీసీ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, పోలింగ్‌లో పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచాలని అయన పిలుపునిచ్చారు. గురువారం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులుతో కలిసి కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకున్న చర్యలను వివరించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందని, మేయర్/చైర్పర్సన్, వార్డు సభ్యుల తుది పోటీ అభ్యర్థుల జాబితా ఖరారైందని కలెక్టర్ తెలిపారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ తుది దశలో ఉందన్నారు. ఎంపీటీసీ, కెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27న తుది అభ్యర్థుల జాబితా ఖరారైందని, బ్యాలెట్ పత్రాల ముద్రణ కొనసాగుతోందని వెల్లడించారు. పోలింగ్, ఓట్ల లెక్కింపునకు అవసరమైన పత్రాలను కూడా సిద్ధం చేసినట్లు చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 1న మున్సిపాలిటీల్లో పోలింగ్, 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఈ నెల 5న పోలింగ్ నిర్వహిస్తామ ని, అవసరమైతే 6న తిరిగి పోలింగ్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సామగ్రిని ఈ నెల 31న, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సామగ్రిని 4న పంపిణీ చేయనున్నట్లు వివరించారు. తక్కువ వ్యవధిలో పోలింగ్‌తో పాటు ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, సిబ్బంది నియామకం, భద్రత, ఇతర ఏర్పాట్లను సమగ్ర ప్రణాళికతో చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా క్షేత్రస్థాయిలో పటిష్టమైన ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, సాధ్యం కాని చోట్ల పూర్తిస్థాయి వీడియో చిత్రీకరణ చేపడతామని వెల్లడించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తామని తెలిపారు. దీని ద్వారా పోలింగ్ ప్రక్రియను అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారని వివరించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫెసిలిటేషన్ కేంద్రా లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ సిబ్బంది. భద్రతా సిబ్బంది. రవాణా సిబ్బంది ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ఎంపీటీసీ, జెడ్సీటీసీ ఎన్నికలకూ ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామని, ఇందుకు సంబంధించిన వివరాల ను ముందుగానే తెలియజేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన దృశ్యాలను సీసీటీవీ లేదా వీడియో రికార్డింగ్ ద్వారా భద్రపరిచేందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడిం చారు. పోలింగ్ సిబ్బందికి సమగ్ర శిక్షణ అందించామని, పంపిణీ, స్వీకరణ, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. సిబ్బంది రాకపోకలకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేసి, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతరు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. జిల్లా ఎస్సీ ఎల్. సుబ్బారాయుడు మాట్లాడుతూ, ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని భద్రతా చర్యలు చేపట్టిందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూట్ మొబైల్ బృందాలతోపాటు స్ట్రైకింగ్ ఫోర్స్, ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్‌లను అందుబాటులో ఉంచామని, అవసరమైనప్పుడు తక్షణమే స్పందించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ పెట్టెలను సురక్షితంగా తరలించడం, పోలింగ్ అనంతరం స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చడం, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాటికి రక్షణ కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్సీ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌లు, లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, వీడియో కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ఎక్కడైనా అవాంచనీయ ఘటనలు చోటుచేసుకుంటే సీనియర్ పోలీసు అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వ యంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఎన్నికల సమయం లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా, ప్రశాంత తరు భంగం కలిగించినా బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సీ హెచ్చరించారు. రాజకీయ పార్టీలు, నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల నిర్వహణకు సహకరిం చాలని కోరారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు కీలకమని, ప్రతి ఓటరూ బాధ్యతగా ఓటు వేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా యంత్రాంగం పిలుపునిచ్చింది.