పర్యావరణ ప్రమాణాలు పాటించని యూనిట్లపై దాడులు
జలవనరుల పరిరక్షణకు పీసీబీ విస్తృత తనిఖీలు
10 యూనిట్లకు నోటీసులు
నీటి నాణ్యతపై నిర్లక్ష్యం వద్దు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి, : ఆక్వా ప్రాసెసింగ్, ప్రీ- ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి వెలువడే వ్యర్థాలతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉ క్కుపాదం మోపు తోంది. ఇటీవల ఆక్వా వ్యర్థాలపై ఫిర్యాదులు వెల్లువెత్తు తుండటంతో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందిం చారు. ఆక్వా వ్యర్థాల పొల్యూషన్‌పై చర్యలు తీసుకోవాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. దీంతో పీసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 82 ప్రాంతాల్లో విస్తృ తంగా తనిఖీలు చేశారు. ఆయా ప్రాంతాల్లో జల వన రుల నమూనాలను సేకరించారు. చాలా ప్రాంతాల్లో పీహెచ్ స్థాయిలు, నీటిపై తేలియాడే ఘన వ్యర్థాలు, వీఓడీ వంటి కీలక ప్రమాణాలు పాటించడం లేదని ప్రాథమికంగా గుర్తించారు. పర్యావరణ ప్రమాణాలు పాటించని 10 యూనిట్లకు నోటీసులు జారీ చేశారు. రెండు వారాలు గడువు ఇచ్చి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని లేకుంటే యూనిట్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సోమవారం పీసీబీ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సమీక్ష నిర్వహించారు.
జల వనరుల సంరక్షణపై కఠిన చర్యలు....
జల వనరులు కలుషితం కాకుండా నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికా రులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా యూ నిట్‌లలో పర్యావరణ ప్రమాణాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నదులు, కాలువలు, చెరువులు, సాగర సంగమ ప్రాంతాలు, భూగర్భజలాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 118 ఆక్వా ప్రాసెసింగ్. 12 ప్రీ-ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తున్నట్లు ఏపీపీ సీబీ అధికారులు తెలిపారు. వీటిలో పర్యావరణ ప్రమా డాల అమలుపై విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 82 యూనిట్ల నుంచి నమూనాలు సేకరించినట్లు తెలిపారు, పర్యావరణ ప్రమాణాలు పాటించలేదని గుర్తించిన 110 యూని ట్లకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికా రులు తెలిపారు. వివరణ ఇచ్చేందుకు, దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు రెండు వారాల గడువు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉల్లంఘనలు పునరావృతం చేసే యూని ట్లపై పర్యావరణ చట్టాల మేరకు నియంత్రణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆక్వా యూనిట్ల నుంచి శుద్ధి చేయని వ్యర్థ జలాలు విడుదలైతే వాటి లోని కాలుష్య కారకాల కారణంగా జల వనరుల నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యర్థ జలాల్లో బీఓదీ స్థాయులు అధికమైతే నీటిలో కరిగిన ఆక్సిజన్ తగ్గి జలచర జీవ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం వడే ప్రమాదం ఉం దన్నారు. ముఖ్యంగా మత్స్య సంపదపై ప్రభావం చూపే అవకాశం ఉ ందని వివరించారు. అదేవిధంగా టీ ఎస్ఎన్ స్థాయులు పెరగడం వల్ల నీటి నాణ్యత క్షీణించి జలచరాల ఆవాసాలు ప్రభావితమయ్యే అవకాశం ఉం దన్నారు. అసాధారణ పీహెచ్ స్థాయులు కూడా జల తరజీవులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు.