అమరావతి ఎకనమిక్ రీజియన్
సరికొత్త పారిశ్రామిక స్వరూపం
ఏఈఆర్లో ఎన్టీఆర్ జిల్లా భాగం కావడం గర్వకారణం
అన్ని రంగాల్లో సామర్థ్యాల సద్వినియోగం అత్యంత కీలకం
క్లస్టర్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి
ప్రత్యేక వర్క్‌షాప్‌లో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అమరావతి ఎకనమిక్ రీజియన్ (ఏఈఆర్)తో నరికొత్త ఊపు రానుందని.. పారిశ్రామిక రూపురేఖలు పూర్తిగా మారసున్నాయని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. అమరావతి ఎకనమిక్ రీజియన్‌లో ఎన్టీఆర్ జిల్లా భాగం కావడం జిల్లాకు గర్వకారణమని, ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని పెట్టుబడులు పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను మరింత పెంపొందించే దిశగా సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నవ్య రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా, దానిచుట్టూ ఉన్న జిల్లాలను అనుసంధానిస్తూ అమరాపతి ఎకనామిక్ రీజియన్ పేరుతో భారీ ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికల రూపకల్పనలో భాగంగా మేధోమథన చర్చలు, పర్క్షావ్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఏఈఆర్ ప్రణాళికపై జిల్లాస్థాయి భాగస్వామ్య పక్షాలతో పర్క్షాప్జరిగింది. ఈ వర్క్‌షాప్‌లో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, సమన్వయ శాఖల అధికారులు హాజరుగ కాగా పీడబ్ల్యూసీ ప్రతినిధి బినయ్ సోరెంగ్.. వికసిత్ భారత్ 2047 తొమ్మిది పిల్లర్స్‌తో పాటు స్వర్ణాంధ్ర విజన్‌లోని శూస్య పేదరికం, నైపుణ్యాభివృద్ధి, అగ్రి టెక్, డీప్ టెక్ తదితర పది సూత్రాలను వివరించారు. అదే విధంగా జిల్లాలో ఆర్థిక వృద్ధికి ఉన్న కీలక అవకాశాలను వివరించారు. వ్వవసాయ, అనుబంధ రంగాలు వంటి సంప్రదాయ రంగాలతో పాటు ఐటీ, ఐటీఈఎస్, డిజిటల్ , సేవలు వంటి సన్‌రైజ్ రంగాల్లోనూ అధిక వృద్ధికి అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీళ మాట్లాడుతూ జిల్లాలోని వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం, రవాణా, వాణిజ్యం, పర్యాటకం తదితర రంగాల్లో ఉన్న అవకాశాలను గుర్తించి, వరస్పర అనుసంధానంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలు, పసరులు, నైపుణ్యాలు, మౌలిక వనతులను గుర్తించి వాటికి అనుగుణంగా క్లస్టర్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి చేపట్టడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించపచ్చని.. ఈ దిశగా ఇప్పటికే దృష్టిసారించినట్లు వివరించారు. స్థానికంగా లభించే పసరులకు విలుపసు జోడించే పరిశ్రమలను ప్రోత్సహించడం, సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు అవసరమైన సహకారం అందించడం, యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని.. అమరావతి ఎకనమిక్ రీజియన్ ద్వారా ఏర్పడే అవకాశాలను జిల్లాలోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, యువత, మహిళా పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకునేలా అవసరమైన సహకారం, మార్గదర్శకత్వం అందించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమస్వయం, ప్రైవేటు రంగ భాగస్వామ్యం, స్థానిక వనరుల సమర్థ వినియోగం ద్వారా సుస్థిరమైన, సమగ్ర ఆర్థిక వృద్ధికి బాటలు వేయవచ్చని తద్వారా ఏఈఆర్లో కీలక ప్రాంతంగా జిల్లాను నిలబెట్టవచ్చని పేర్కొన్నారు. పర్క్ షాప్‌లో వ్యవసాయం, వరిశ్రమలు, పర్యాటకం, ఏపీఐఐసీ తదితర శాఖల అధికారులతో పాటు పారిశ్రామిక అసోసియేషన్ల ప్రతినిధులు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఇవి రాష్ట్ర స్థాయిలో నమగ్ర ప్రణాళికల రూపకల్పనకు దోహదపడతాయి.
కార్యక్రమంలో సీపీవో వై.శ్రీలత, వీఎంసీ చీఫ్ ఇంజనీర్ పి.సత్యకుమారి, వినోద్ (జేఆర్డీ టాటా ఇండస్ట్రియల్ ఎస్టేట్), రామచంద్రరావు, పార్థసారథి (ఎంఎస్ఎంఈ అసోసియేషన్), అల్ట్రాటెక్, సెంటిని, శ్రీ భరత్ ల్యాబ్స్ తదితర పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.