గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకే కొందరు కుట్ర
ఎక్స్ వేదికగా ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్ లింక్‌ను అడుగుపెట్టకుండా భారత్‌లో టెలికాం రంగంలో ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న కొందరు శక్తిమంతులు అడ్డుకుంటున్నారని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత టెలికాం మార్కెట్‌పై తమకున్న గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకే వారు ఈ కుట్ర చేస్తున్నారని, ఇది భారత ప్రజలపై చేస్తున్న నేరమని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీని వెనుక ఉన్నది ఎవరో ఇప్పటికీ మీరు ఊహించుకోవచ్చంటూ ఎక్స్ వేదికగా మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే, ఆయన నేరుగా ఏ కంపెనీ లేదా వ్యక్తుల పేర్లను అందులో ప్రస్తావించలేదు. భారతదేశంలోని మారుమూల గ్రామాలకు ఇప్పటికీ మెరుగైన ఇంటర్నెట్ నదుపాయాలు అందుబాటులో లేవని డాడ్జ్ డిజైనర్ అనే ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు కీలకంగా మారతాయని అందులో వివరించారు. భారత టెలికాం మార్కెట్లో తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కొందరు కుబేరులు స్టార్ంక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని మస్క్ ఆరోపించారు. ఈ వ్యక్తులను రష్యాకు చెందిన ఒలిగార్హతో పోల్చారు. ఒలిగార్లు అంటే రాజకీయ, ఆర్థిక వ్యవస్థలపై గణనీయమైన ప్రభావం చూపగల సంపన్నులు. భారత్‌లో ఉగ్రవాదులు స్టార్‌లింక్ సేవలను ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలను కూడా మస్క్ తోసిపుచ్చారు. భారతదేశంపై స్టార్ంక్ శాటిలైట్ బీమ్స్ ను నిలిపివేశామని, అందువల్ల ఈ సేవలను ఎవరైనా ఉపయోగించారన్న వాదనలు పూర్తిగా అవాస్తవమని ఎక్స్‌లో స్పష్టం చేశారు. మణిపుర్ సమీపంలో మయన్మార్ దళాలు స్టార్ంక్ టెర్మినళ్లను స్వాధీనం చేసుకున్నాయని పేర్కొంటూ వచ్చిన మరో పోస్టుపై ఈ చర్చ మొదలైంది. భారత్‌లో స్టార్ంక్ ఉపగ్రహ సంకేతాలు అందుబాటులో లేనప్పుడు అక్కడి వరికరాలు ఆ సేవకు అనునంధానమయ్యే అవకాశం లేదని డాడ్జ్ డిజైనర్ ఖాతా వాదించింది. భారత్‌లో ఉగ్రవాదులు స్టార్ంక్ను ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు అర్థరహితమని పేర్కొంది. ఈ వాదనకు మస్క్ స్పందిస్తూ, భారతదేశం పై స్టార్ంక్ బీమ్స్ నిలిపివేసిన విషయాన్ని ధ్రువీకరించారు. స్టార్ంక్ అనేది స్పేస్ ఎక్స్‌కు చెందిన టెలికమ్యూనికేషన్ల అనుబంధ సంస్థ, ఉపగ్రహాల ద్వారా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను అందించడం దీని ప్రధాన లక్ష్యం. ఇదిలా ఉండగా భారత్‌లోని మారుమూల ప్రాంతాలకు స్టార్ంక్ వంటి సేవలు అవసరమని డార్జ్ డిజైనర్ పోస్టు వివరించింది. మే 2026 నాటికి దేశంలోని 11,256 గ్రామాలకు 4జీ కవరేజీ లేదని పేర్కొంది. మార్చి 2026 నాటికి దేశంలో మొత్తం 1,093 బిలియన్ ఇంటర్నెట్ సబ్ స్క్రిప్షన్లు ఉండగా, వాటిలో 440.87 మిలియన్లు గ్రామీణ ప్రాంతాలకు చెందినవని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 100 మందికి 128.80 ఇంటర్నెట్ సబ్ స్క్రిప్షన్లు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 48.31గా ఉందని ఆ పోస్టులో పేర్కొన్నారు. దేశంలోని మొత్తం ఇంటర్నెట్ సబ్స్క్రిస్క్రిప్షన్లలో వైర్డ్ బ్రాడ్‌బ్యాండ్ వాటా 4.26 శాతమేనని వివరించారు. ఫైబర్ నెట్వర్క్ లేదా మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడం కష్టంగా ఉండే మారుమూల గ్రామాలు, పర్వత ప్రాంతాలు, ద్వీపాలకు శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా వేగవంతమైన కనెక్టివిటీ అందించవచ్చని పోస్టు పేర్కొంది. దీనివల్ల గ్రామీణ పాఠశాలల్లో ఆన్లైన్ విద్యకు, వైద్య కేంద్రాల్లో దూరవైద్య సేవలకు, చిన్న వ్యాపారాలు తమ వినియోగదారుల పరిధిని విస్తరించుకోవడానికి ప్రయోజనం కలుగుతుందని తెలిపింది.