రంజీ ట్రోఫీలో గెలుపు బోణీ కొట్టిన హైదరాబాద్ టీమ్
రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. టీమిండియా ఫాస్ట్ బౌ లర్ మహ్మద్ సిరాజ్ సారథ్యంలో బరిలోకి దిగిన హైదరాబాద్.. గ్రూప్-బి తొలి మ్యాచ్‌లో త్రిపురపై ఇన్నింగ్స్ 40 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు పూర్తి ఆధివత్యం ప్రదర్శించారు. హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర, హైదరాబాద్ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్ 134 పరుగులకే కుప్పకూలింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అనికేత్ రెడ్డి 5 వికెట్లతో చెలరేగగా, తనయ్ త్యాగరాజన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్, ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (54), రుతిక్ యాదవ్ (61), రాహుల్ రదేశ్ (40), చామ మిలింద్ (40) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసి కీలక ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ త్రిపుర బ్యాటర్లు చేతులెత్తేశారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ ఈసారి 6 వికెట్లతో త్రిపుర వతనాన్ని శాసించాడు. కెప్టెన్ సిరాజ్ రెండు కీలక వికెట్లు తీయడంతో త్రిపుర 120 పరుగులకే ఆలౌటైంది. దీంతో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు తీసిన తనయ్ త్యాగరాజన్ హీరోగా నిలిచాడు.