ఇదే బీజేపీకి మార్గదర్శక సూత్రం
సేవ సంకల్ప యాత్ర కార్యకర్తలతో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: అధికారంలో ఎంత ఎడిగినా సేవా మార్గాన్ని బీజేపీ ఎప్పటికీ వీడచని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ నుంచి దిల్లీ వరకు బీజేపీ పాలన, విలువల్లో ప్రజాసేవే మార్గదర్శక సూత్రంగా కొనసాగిందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని దేవాన్ నుంచి వారణాసికి సాగుతున్న సేవా సంకల్ప యాత్రలో పాల్గొంటున్న వారితో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మోదీ 76వ జన్మదినం. ప్రజాప్రతినిధిగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని వివిధ రాష్ట్రాలకు చెందిన యువత ఈ యాత్రను నిర్వహిస్తోంది. వదోదర నుంచి ప్రారంభమైన ఈ యాత్ర వారణాసి వరకు కొనసాగుతోంది. పాలనలో సేవా భావం కేంద్రంగా ఉన్నప్పుడు ప్రతి విధానంలోనూ పౌరులే కేంద్రబిందువుగా ఉంటారని మోడీ పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎంత అధికారం లభించినా తమ ప్రాథమిక మార్గం ప్రజాసేవగానే ఉంటుందని తెలిపారు. సేవ గురించి మాటలతో ప్రచారం చేయడం కంటే ఆచరణలో చూపించాలని యువతకు సూచించారు. ప్రజలకు సేవ చేయడం ద్వారాసేవా సందేశాన్ని చాటాలని, నిస్వార్ధ సేవే లక్ష్యంగా ముందుకు సాగాలని మోడీ పిలుపునిచ్చారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణంలో య-వత కీలక పాత్ర పోషించాలని.. గ్రామీణ ప్రాంతాల్లోని సంప్రదాయ జ్ఞానం, స్థానిక పరిష్కారాలను తెలుసుకుని వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రధాని మోడీ సూచించారు.