టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే ప్రతిభ ఉంటే సరిపోదు. అవకాశాలు వచ్చినప్పుడు సత్తా చూపాలి. అదే సమయంలో ఫిట్నెస్, ఆటలో మెరుగుదలతో సెలెక్టర్ల నమ్మకాన్ని గెలవాలి. గత ఏడాదిన్నరగా సర్ఫరాజ్ ఖాన్ అదే పనిలో ఉన్నాడు. ఏకంగా 17 కిలోల బరువు తగ్గాడు. కాశ్మీర్‌కు వెళ్లి ప్రత్యేకంగా సాధన చేశాడు. స్పిన్‌ను ఎదుర్కొనేందుకు గంటల తరబడి బ్యాటింగ్ చేశాడు. ఫలితంగా రెండేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి తిరిగొచ్చాడు. సాయిసుదర్శన్ గాయపడటంతో సర్ఫరాజ్క మరో అవకాశం తలుపుతట్టింది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కు అతడిని ఎంపిక చేశారు. న్యూజిలాంద్ తో 2024లో జరిగిన సిరీస్‌లో వరుసగా నాలుగు ఇన్నింగ్స్ ల్లో విఫలమైన తర్వాత సర్పరాజ్ జట్టుకు దూరమయ్యాడు.
పట్టుదలతో సాధన
అవకాశం కోసం ఎదురుచూస్తూనే తన లోపాలపై దృష్టి పెట్టాడు సర్ఫరాజ్. గత ఏడాదిన్నరలో 17 కిలోలు తగ్గాడు. ముంబయిలో వర్షాల కారణంగా సాధనకు ఇబ్బంది రావడంతో కాశ్మీర్‌లోని షేర్-ఏ-కశ్మీర్ స్టేడియంలో గంటల తరబడి బ్యాటింగ్ సాధన చేశాడు. నెట్ బౌలర్లతో పాటు కశ్మీర్ ఆటగాళ్ల బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. ముంబయిలోనూ సాధన ఆవలేదు. బీకేసీలోని ఎంసీఏ ఇండోర్ కేంద్రంలో ఆస్ట్రో టర్స్పై బ్యాటింగ్ చేశాడు. కుర్లాలోని ప్రైవేట్ మైదానాల్లో ఎర్ర మట్టితో కూడిన పిచ్‌లపై సాధన చేశాడు. ముఖ్యంగా స్పిన్‌ను ఎదుర్కొనేందుకు తన ఆటను పదును పెట్టుకున్నాడు.
స్పిన్ అంటే సర్పరాజ్‌కు ఇష్టం
ప్రస్తుతం భారత జట్టులో స్పిన్‌ను బాగా ఆడే బ్యాటర్లలో సర్ఫరాజ్ ఒకడిగా భావిస్తున్నారు. సాధారణ స్వీప్‌తో పాటు రివర్స్ స్వీప్న సమర్థంగా ఆడగలడు. శ్రీలంక పిల్లపై స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఈ నైపుణ్యం అతడికి ఉ వయోగపడే అవకాశం ఉంది. ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్ భారత్-ఏ తరఫున 92 పరుగులు చేశాడు. బెక్స్ట్రామ్లో జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాడు. ఇప్పుడు జట్టులోకి వచ్చిన సర్పరాజ్‌కు తనను తాను నిరూపించుకునే మరో పెద్ద అవకాశం దక్కింది.