జపాన్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు తేజంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో అగ్ర దర్శకుడు రాజమౌళి పోస్ట్‌కు సింధు ఇచ్చిన రిప్లై అందరినీ ఆకర్షిస్తూనే నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీసింది. సింధును అభినందిస్తూ రాజమౌళి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. జపాన్ ఓపెన్ గెలిచిన తొలి ఇచ్చావు. కంగ్రాట్స్ సింధు. నిన్ను చూసి దేశం గర్విస్తోందని శుభాకాంక్షలు తెలిపారు. దీనికి స్పందించిన ఆమె.. ధన్యవాదాలు రాజమౌళి సర్. మీ వారణాసి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఒకవేళ మీరు తెరకెక్కించే ఏ సినిమాలో అయినా బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర ఉంటే.. మీ పరిచయ సటిగా మారడానికి నేను ఎంతో సంతోషిస్తాను' అంటూ నవ్వుతున్న ఎమోజీలను పంచుకున్నారు. ప్రస్తుతం సింధు రిప్లై నెట్టింట వైరల్ అవుతుండగా.. త్వరలోనే సినిమాల్లోకి రాసుందా అనే చర్చ మొదలైంది. రాజమౌళికి క్రీడాకారుల నుంచి ఈ తరహా రిక్వెస్ట్‌లు రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా జక్కన్నకు ఇలాంటి రిప్లై ఇచ్చారు. తెలుగు సినిమా పాటలకు తనదైన స్టైల్లో డ్యాన్స్ వేస్తూ పోస్ట్‌లు పెట్టే వార్నర్‌కు.. మన దర్శకధీరుడు 'బాహుబలి' కీరిటాన్ని కూడా పంపారు. ఇక 'వారణాసి' విషయానికొస్తే.. దీని షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అక్టోబర్ నాటికి పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయనున్నారు.