త్వరగా ముసాయిదా సిద్ధం చేయాలి
విద్యార్థుల హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యం
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ నేతృత్వంలో
కమిటీ ఏర్పాటు న్యాయ, విద్య, హోంశాఖ,
యూజీసీ భాగస్వామ్యంతో కనరత్తు సచివాలయంలో
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్
సబ్ కమిటీ సమావేశం హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్
హైదరాబాద్: రోహిత్ వేముల తెలంగాణ బిల్లు ప్రాథమిక ముసాయిదా ను మూడు నెలల్లోగా సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. విశ్వవిద్యాల యాలు, ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల హక్కులను పరిరక్షిస్తూ, కులం, సామాజిక నేపథ్యం ఆధారంగా వివక్షకు తావులేకుండా నమగ్ర చట్టాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మ-సాయిదాను మూడు నెలల్లోగా సిద్ధం చేసి సీనియర్ సివిల్ సర్వెంట్ల కమిటీ (సీఎస్సీ)కి సమర్పించాలన్నారు. కమిటీ ఏర్పాటు నుంచి వివిధ భాగస్వామ్య పక్షాలతో సంప్ర దింపుల వరకు ప్రతి దశను నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని, ఎలాంటి జాప్యానికి తావివ్వరాదని సూచిం చారు. సచివాలయంలో శు క్రవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన రోహిత్ వేముల తెలంగాణ బిల్లుపై సీనియర్ సివిల్ సర్వెంట్ల కమిటీ రెండో సమావేశం జరిగింది. ప్రతిపాదిత బిల్లు రూపకల్పనకు అనుసరిం చాల్సిన విదానం, కమిటీ కూర్పు, న్యాయవరమైన అంశాలు, వివిధ వర్గాలతో సంప్రదింపుల ప్రక్రియపై సమా వేశంలో విస్తృతంగా చర్చించారు. 'రోహిత్ వేముల చట్ట రూపకల్పన ప్రక్రియకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ (ఎస్పీడీడీ) నాయకత్వం వహించాలని సూచిం చారు. అవసరమైన సంబంధిత శాఖలు, సంస్థలకు కమిటీలో ప్రాతినిధ్యం కల్పిం చాలని, న్యాయశాఖను భాగస్వామిగా చేర్చాలని స్పష్టం చేశారు. విద్యాశాఖ, హోం శాఖ, యూజీసీ తదితర సంస్థల భాగస్వామ్యంపై పరిశీలన జరపాలని సూచిం చారు. కమిటీని వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి, మ-సాయిదా తయారీకి అవస రమైన కార్యాచరణను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. విద్యార్థులు, అధ్యాపకులు, న్యాయ నిపుణులు, పౌర సమాజ సంస్థలు విద్యా రంగ నిపుణులు, ఇతర భాగస్వామ్య వక్షాలతో చర్చలు జరిపేందుకు ముందుగా జాబితా రూపొం దించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షకు సంబంధించిన అంశాలు, చట్ట అమలులో ఎదురయ్యే నవాళ్లను పరిగణనలోకి తీసుకొని ముసాయిదా సిద్ధం చేయాలన్నారు. అనంతరం న్యాయశాఖను కమిటీలో సభ్య శాఖగా చేర్చాలని, అయితే కమిటీకి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ నాయకత్వం వహించాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అవసరాన్ని బట్టి ఇతర శాఖలు, నిపుణులు, సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. బిల్లుకు అవసరం మేరకు న్యాయపరమైన, సాంకేతిక అంశాల్లో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం సహకారం తీసుకోవాలని సమావేశంలో చర్చించారు. నిబంధనల రూపకల్పనలో సహకరించేందుకు నల్సార్ విశ్వవిద్యాలయం అంగీకరించినట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి ఉప ముఖ్యమంత్రికి వివరించారు. విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడం, వివక్షను నిరోధించడం, విద్యాసంస్థల్లో న్యాయబద్ధమైన వాతావరణాన్ని బలోపేతం చేయడం వంటి అంశాలకు ప్రతిపాదిత చట్టంలో ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశం అభిప్రాయపడింది. మూడు నెలల్లోగా ప్రాథమిక ముసాయిదాను సీనియర్ సివిల్ సర్వెంట్ల కమిటీకి సమర్పించి, తదువరి పరిశీలనకు వీలుగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్ణీత గడువులో కనరత్తు పూర్తయ్యేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని, విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ఉపయోగపడే నమగ్ర చట్టం రూపకల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రెటరి సవ్యసాచి ఘోష్, ష్, సీనియర్ ఐపీఎస్ అధికారి దేవేంద్ర సింగ్ చౌహాన్, ఐఏఎస్ అధికారులు యోగితా రాణా, విజయేంద్ర బోయి, న్యాయవాది దిశా వేడేక పాల్గొన్నారు.