ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక చీకటి కోణం ఏదో ఒక రోజు బయటపడుతూనే ఉంటుంది. ఇప్పటివరకూ నేను ఎలాంటి తప్పు చేయలేదు అని భావించేవారంతా తమలోని ప్రమాదకర ఇన్నర్ మానవుడిని గుర్తించలేరు. అయితే జాన్వీ కపూర్ అలా కాదు.. తాను చేసిన తప్పును గుర్తించారు. తనలోని తప్పును తెలుసుకోగలిగారు. అంతేకాదు.. దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించి చివరికి విజయం సాధించారు. ఇంతకీ జాన్వీ చేసిన తప్పు ఏంటి? ఎలా బయటపడ్డారు? అంటే వివరాల్లోకి వెళ్లాలి. తనకు మద్యం బాటిల్ చూడగానే నాలుక పిడచగట్టుకుపోయేదని జాన్వీ కపూర్ నిజాయితీగా అంగీకరించారు. ఈ స్థితి నుంచి బయటపడలేకపోయానని తెలిపారు. బాలీవుడ్ నటి జన్వీ కపూర్ తన వ్యక్తిగత జీవితంలోని చీకటి కోణాలను బహిరంగంగా వెల్లడించారు. మద్యం తాగాలనే బలమైన కోరికలు తనను ఎలా చుట్టుముట్టాయో ఈ యువనటి వెల్లడించారు. ఇది కేవలం ఒక సెలబ్రిటీ గాసిప్ మాత్రమే కాదు.. సమాజంలో చాలామంది తెలియకుండానే మద్యంపై ఆధారపడటానికి అలవాటు పడతారని జాన్వీ తెలిపారు. తను ఎదుర్కొన్న ఒక తీవ్రమైన బాధాకరమైన అనుభవం తర్వాత..ఆ మానసిక వేదన నుండి తప్పించుకోవడానికి మద్యం ఒక మార్గంగా మారిందని తెలిపారు. సామాజిక వినోదం కోసం తాగడం వేరు.. కానీ మానసిక ప్రశాంతత కోసం మద్యంపై ఆధారపడటం అనేది ప్రమాదకరమైన మలుపు అని తన అనుభవాన్ని జాన్వీ చెప్పుకొచ్చారు.