గోదావరి గోల్డెన్ ఈగల్ప్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపు
96 పరుగులకే గోదావరి ఆలౌట్ 17.1 ఓవర్లలో
లక్ష్యాన్ని ఛేదించిన రాయలసీమ
అద్భుత బౌలింగ్ తో చెలరేగిన ఎ. శిరీషకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
మంగళగిరి: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో నిర్వహించిన విమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) తొలి సీజన్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు విజేతగా నిలిచింది. మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గోదావరి గోల్డెన్ ఈగల్‌పై నాలుగు వికెట్ల తేడాతో రాయలసీమ విజయం సాధించింది. టాస్ గెలిచిన గోదావరి జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హేన్రిట్టా పెరీరా 44 బంతుల్లో 45 వరుగులతో రాణించగా, రాయలసీమ బౌలర్లలో ఎ. శిరీష నాలుగు వికెట్లు, ఈ. పద్మజ రెండు వికెట్లు, వాసవి, ధాత్రి చెరో వికెట్ పడగొట్టారు. 97 పరుగుల లక్ష్యాన్ని రాయలసీమ జట్టు 17.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ. పద్మజ 39, శుభశ్రీ 80 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌లు ఆచారు. గోదావరి బౌలర్లలో క్రిష్టి శేఖర్ రెండు వికెట్లు, హారిక, హేబ్రిట్టా పెరీరా చెరో వికెట్ సాధించారు. అద్భుత బౌలింగ్‌తో రాయలసీమ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎ. శిరీషకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం నిర్వహించిన డ్రోన్ షో, బాణానంచా ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టోర్నమెంట్లో ఎకనామికల్ బౌలర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా కే. హారిక, పవర్ఫుల్ స్ట్రైకర్‌గా కే. దేవిక, పర్పుల్ క్యాప్ విజేతగా ఈ వద్మంు, ఆరెంజ్ క్యాప్ విజేతగా హేన్రిట్టా పెరీరా, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఈ. పద్మజ, ఎమర్జింగ్ ప్లేయర్‌గా కె. పుష్పిత ఎంపికయ్యారు. ఫెయిర్ ప్లే అవార్డు గోదావరి గోల్డెన్ ఈగల్‌కు దక్కింది. సినీ నటి నిధి అగర్వాల్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజేత రాయలసీమ జట్టుకు రూ.15 లక్షల నగదు బహుమతి, రన్నరప్ గోదావరి గోల్డెన్ ఈగలక్కు రూ.8 లక్షల నగడు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాధ్, సెక్రటరీ సానా సతీష్, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ కళ్యాణ్ కృష్ణ, ముత్తవరపు మురళీకృష్ణ, ఎమ్మెల్సీ గ్రీమ్మ, మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ తదితరులు పాల్గొన్నారు.