అనిల్ రావిపూడి 'జనవరి 12 విడుదల' సినిమాపై అంచనాలు మెల్ల మెల్లగా పెరుగుతున్నాయి. షూటింగ్ ప్రారంభం నమయంలో చేసిన వీడియోలు, టైటిల్ రివీల్ కోసం చేసిన వీడియోల కారణంగా సినిమా మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈసారి వెంకటేష్, కళ్యాణ్ రాము కలిసి చేసే సందడి అంతా ఇంతా ఉండదని అనిల్ రావిపూడి అంటున్నాడు. ఇక హీరోయిన్స్ గా నటిస్తున్న కీర్తి సురేష్, కృతి శెట్టి సైతం ఇంతకు ముందు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిల తరహాలో వినోదాన్ని పంచడం ఖాయం అని ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్నాడు. మొదటి సారి జీవీ ప్రకాష్ కుమార్ తో అనిల్ రావిపూడి వర్క్ చేస్తున్న నేపథ్యంలో ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ సినిమాలకు సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించిన విషయం తెల్సిందే. అయితే ఈసారి సంగీత దర్శకుడిని మార్చడం ద్వారా అంతకు మించి ఆశిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో జీవీ ప్రకాష్ కుమార్ ఇచ్చిన మ్యూజిక్ ఆల్బంలు కొన్ని మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమాతో మరోసారి జీవీ తన సత్తా చాటుతాడనే నమ్మకం కలుగుతుంది. ఇప్పటికే పాటల రికార్డింగ్ మొదలు పెట్టారని తెలుస్తోంది. ఆ మధ్య సంగీత దర్శకుడితో కలిసి అనిల్ రావిపూడి ఒక ఫన్నీ వీడియోను చేసిన సమయంలోనే కొన్ని పాటల ట్యూన్స్ ను రెడీ చేశారట. ఇప్పుడు ఒక పాటను విడుదల చేయడం కోసం రెడీ చేస్తున్నారు అంటూ యూనిట్ సభ్యుల నుంచి లీక్ అందుతోంది.