రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ కాదు బాక్స్ ఆఫీస్ క్వీన్ అనే రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కన్నడ బ్యూటీ అయిన రష్మిక మందన్న ఇటు తెలుగు, హిందీ చిత్రాలతో ఆడియన్స్ హృదయాలను దోచుకుంటుంది. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా హీరోయిన్గా మరింత బిజీగా మారిన రష్మిక మందన్న వివాహం తర్వాత తన భర్తతో కలిసి నటిస్తున్న తొలి చిత్రం రణబాలి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో.. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 16న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వివాహం తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అటు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కూడా దేవాలయాలను సందర్శిస్తూ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే నేడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న ఈ జంట.. కాసేపటి క్రితం సత్యసాయిబాబా ప్రశాంతి నిలయంలో సందడి చేశారు.. మరొకవైపు సేవా కార్యక్రమాలను చేపడుతూ వేగంగా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అందులో భాగంగానే ప్రాజెక్టు అన్నపూర్ణ పేరుతో ఏకంగా 400 కుటుంబాలను రష్మిక దత్తత తీసుకోవడమే కాకుండా మూడు నెలలకు సరిపడా ఒక్కో కుటుంబానికి అవసరమయ్యే విత్యావసర సరుకులను కూడా అందించారు. ప్రత్యేకించి ఎనిమిది ప్రాంతాల నుండి ఎంపిక చేసిన కుటుంబాలకు ఈ ప్రత్యేక నిత్యావసర కిట్ ఇవ్వడం జరిగింది.