సౌత్ ఇండియన్ సినిమా వర్గాల్లో తన నటనతో, రాజసంతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి రమ్యకృష్ణ, నాలుగు దశాబ్దాలుగా వెండితెరపై నటిగా అలరిస్తున్న ఈ సీనియర్ నటి తాజాగా పంచుకున్న ఫొటోషూట్ నెట్టింట తెగ వైరల్ అపుతోంది. మస్టర్డ్ ఎల్లో రంగు చీరలో సంప్రదాయ సౌత్ ఇండియన్ లుక్ తో మెరిసిపోతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ రేర్ అండ్ స్టైలిష్ లుక్స్ తో పాటు ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. తాజాగా షేర్ చేసిన పోర్ట్రెయిట్ ఫొటోల్లో రమ్యకృష్ణ క్లాసిక్ సౌత్ ఇండియన్ బ్యూటీలా అలరిస్తున్నారు. సున్నితమైన పూల డిజైన్లు ఉన్న మస్టర్డ్ ఎల్లో చీర, దానికి జోడీగా ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధరించి ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఇక సాంప్రదాయ ఆభరణాలు, సిల్వర్ కన్తో కూడిన ఆమె చిరునవ్వు, ఆత్మవిశ్వానంతో కూడిన చూపులు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె రాయల్ లుక్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక టీనేజర్‌గా 1980ల మధ్యలో చిత్రసీమలోకి అడుగుపెట్టిన రమ్యకృష్ణ, తమిళ చిత్రం "వెళ్లై మనను, తెలుగు చిత్రం భలే మిత్రులు' ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1990లలో స్టార్ హీరోయిన్గా సంచలనం సృష్టించిన ఆమె, 'బాహుబలి' చిత్రంలో శివగామిగా విశ్వరూపం చూపించారు. ఇక ఆ తర్వాత 'సూపర్ డీలక్స్', రజనీకాంత్‌తో తో 'జైలర్ 1', 'లైగర్' వంటి విభిన్న చిత్రాల్లో పవర్ ఫుల్ పాత్రలు పోషించి మెప్పించారు. సటిగా ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు.