భారత సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 'రామాయణం: పార్ట్ 1'. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రణ్ బీర్ కపూర్ రాముడిగా, సాయివల్లవి సీతగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ చిత్రం 2026 నవంబర్ 5న దీపావళి పండుగకు ముందుగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నవరాత్రులు శుభ సందర్భంగా ఈ ప్రకటన చేస్తూ, చిత్రంలోని ప్రధాన తారాగణంతో కూడిన ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఆదివారం నాడు చిత్ర నిర్మాణ సంస్థలు తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించాయి. "ఇది రాముని యుగానికి ఆరంభం" అనే సందేశంతో ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్లో రాముడిగా రణ్ బీర్, సీతగా సాయివల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే, రావణుడిగా యశ్ కనిపించారు. దసరా పండుగ నుంచి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 'దంగల్' ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ రామాయణ గాథను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. నమిత్ మల్హోతకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొదటి భాగం 2026లో రాసుండగా, 'రామాయణం: పార్ట్ 2'ను 2027 దీపావళికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. భారతీయ పురాణానికి ఆధునిక సాంకేతికతను జోడించి, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డీఎన్ జీ సంస్థ దీనికి విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తుండటం విశేషం. ఏ.ఆర్. రెహమాన్ పాటు హాలీవుడ్ లెజెండరీ కంపోజర్ హాన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంగీతం. సమకూరుస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయనుండగా, హిందీ మార్కెట్లో ధర్మ ప్రొడక్షన్స్ విడుదల చేయనుంది. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించేందుకు ఐమ్యాక్స్ ఫార్మాట్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.