టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా భారత క్రికెట్ జట్టు తదుపరి చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉ ౦ది. అజత్ అగార్కర్ ఈ పదవి నుంచి వైదొలగడంతో, ప్రస్తుతం సెలెక్షన్ కమిటీకి తాత్కాలిక హెడ్‌గా ఉన్న 39 ఏళ్ల ఓజానే పూర్తిస్థాయి చీఫ్ సెలెక్టర్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం గువాహటిలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో నలుగురు సెలెక్టర్ల కమిటీ నుదీర్ఘంగా సమావేశమైంది. వెస్టిండీస్‌లో రెండో వన్డేకు ఒకరోజు ముందు బర్సవరా స్టేడియంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ప్రజ్ఞాన్ ఓజాతో పాటు శివ సుందర్ దాస్, అజయ్ రాత్రా, ఆర్పి సింగ్ పాల్గొన్నారు. అయితే, మాజీ చీఫ్ సెలెక్టర్ అజత్ అగార్కర్ ఇందులో పాలుపంచుకోలేదు. సాధారణంగా ఒక ద్వైపాక్షిక సిరీస్ సమయంలో సెలెక్షన్ కమిటీ మొత్తం ఇలా సమావేశం కాపడం అరుదు కాపడంతో, ఓజా నియామకం దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న స్యూజిలాండ్ పర్యటనకు భారత జట్లను ఎంపిక చేసే విషయంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 27 వరకు జరగనున్న ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడసుంది. దీంతో పాటు, అక్టోబర్ 24 నుంచి న్యూజిలాండ్‌లో మూడు టెస్టులు ఆడనున్న భారత్ 'ఎ' జట్టును కూడా ఎంపిక చేయాల్సి ఉంది. భారత జట్టు వరుస సిరీస్ తో తీరిక లేకుండా ఉండటంతో ఆటగాళ్ల వర్క్స్డ్ మేనేజ్మెంట్ కొత్త సెలెక్షన్ కమిటీకి పెద్ద సవాలుగా మారనుంది. 2027 వన్డే ప్రపంచకప్‌న దృష్టిలో పెట్టుకుని జట్టు కూర్పును సిద్ధం చేసేందుకు కూడా ఈ పర్యటన కీలకం కానుంది. సీనియర్ జట్టు అవసరాలతో పాటు, భారత్ 'ఎ' కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం ఓజా నేతృత్వంలోని కమిటీ ముందున్న ప్రధాన కర్తవ్యం.