మార్పు ఎవరు చేశారో తెలుసుకుంటాం
రికార్డులు చూశాకే పూర్తిస్థాయి విచారణ
ఫారమ్-6 మార్పులపై సుప్రీం వ్యాఖ్యలు
సీఈసీ జ్ఞానేశ్ నిర్ణయాలపై పిటిషన్లు..
కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు జారీ
వారంలో సమాధానం ఇవ్వాలని ఆదేశం
'సర్' కోసం అదనపు డిక్లరేషన్ చేర్చాం
ఫారమ్-6ను సవరించలేదని ఈసీ స్పష్టం
న్యూఢిల్లీ: కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఉ పయోగించే ఫారమ్-6లో చేసిన మార్పులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సవరించిన ఫారమ్-6కు తాము అనుమతి ఇవ్వలేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా పరిశీలిస్తామని చెప్పారు. ఫారమ్-6లో అసలు మార్పు జరిగిందా? జరిగితే ఎవరు చేశారు? అనే విషయాలను తేల్చాల్సి ఉందని కోర్టు తెలిపింది. దీనికి సంబంధించిన రికార్డులు తమ ముందుకు వచ్చిన తర్వాతే అంశాన్ని లోతుగా పరిశీలిస్తామని సీజేఐ చెప్పారు. "నవరించిన ఫారమ్-6ను మేం ఆమోదించలేదు. ఇది స్పష్టం" అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. అయితే ఫారమ్-6ను సవరించలేదని ఎన్నికల సంఘం చెబుతోంది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్) కోసం కొత్త ఓటర్లకు అదనపు డిక్లరేషన్ మాత్రమే జత చేశామని వివరిస్తోంది. ఈ అదనపు ప్రకటనను జులైలో చేర్చారు. ఇందులో తల్లిదండ్రులు లేదా తాత, అమ్మమ్మల పాత ఓటరు జాబితా వివరాలను అనుసంధానించాల్సి ఉ టుంది. ఫారమ్-6 రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్-1960లో భాగం. ఈ నిబంధనల్లో మార్పులు చేయాలంటే అధికారికంగా నవరణ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు 29న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే ఈ అంశాన్ని లేవనెత్తారు. ఫారమ్-6 మార్పులకు సంబంధించి ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ప్రతిపాదన తమ వద్ద లేదని న్యాయశాఖ ఆర్టీలు సమాధానంలో చెప్పినట్లు ఆయన తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఒంటరిగానే నిర్ణయాలు తీసుకున్నారా? అనే అంశంపైనా సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి, భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా తమ స్పందన తెలియజేయాలని ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్బి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాననం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఫారం 6లో మార్పులు వంటి పలు కీలక నిర్ణయాలను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మిగతా ఇద్దరు కమిషనర్ల ఆమోదం లేకుండా ఏకపక్షంగా తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. ఎన్నికల సంఘం వంటి బహుళ సభ్యుల కమిషన్లో నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీ ప్రాతిపదికన జరగాలని, కానీ ఇక్కడ అలా జరగలేదని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాననం, ఈసీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. "రాజ్యాంగబద్ధమైన సంస్థలు చట్టానికి లోబడి పనిచేయాలి. ఒకవేళ తీసుకున్న నిర్ణయాలు చట్టవిరుద్ధమని తేలితే, వాటిని రద్దు చేస్తాం" అని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే, సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ విధులకు ఆటంకం కలిగించేలా లేదా ఆయనను నస్సైండ్ చేసేలా ఎలాంటి మధ్యంతర ఉ త్తర్వులు జారీ చేయడానికి కోర్టు నిరాకరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సీఈసీ ఒక్కరే కాకుండా, ముగ్గురు సభ్యుల కమిషన్ సంయుక్తంగా వినియోగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు తమ పిటిషన్లో కోరాడు. ప్రస్తుతం సుప్రీంకోర్టు నోటీసులతో ఈ వ్యవహారంపై కేంద్రం, ఈసీ ఎలాంటి వివరణ ఇస్తాయనేది ఆసక్తికరంగా మారింది. గత 10 నెలల్లో 'నర'కు సంబంధించిన నిర్ణయాలపై ఎన్నికల కమిషనర్లు సుబీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఇటీవల ఓ కథనం వెలువడిన విషయం తెలిసిందే.