డ్రగ్స్‌కు అడ్డుకట్ట.. మహిళలకు భద్రత..
రోడ్లపై ప్రాణాలకు రక్షణ ప్రజల భద్రతే లక్ష్యం..
ప్రతి ప్రాణం రక్షణే ధ్యేయం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, సీపీ ఎస్పీ రాజశేఖర్ బాబు
విజయవాడ, : రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజల భద్రత, సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లాలో "ఆపరేషన్ త్రిశూల్" కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ, మహిళలపై నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాల కట్టడిపై నమగ్ర కార్యాచరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన సీపీ ఎస్పీ రాజశేఖర్ బాబుతో కలిసి నిర్వహించిన నమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు అంశాలను వేర్వేరు కార్యక్రమాలుగా కాకుండా సమగ్ర ప్రజా భద్రతా చర్యగా అమలు చేయాలని, పోలీస్, రవాణా, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డ్రగ్స్ వినియోగదారులను గుర్తించడంతో పాటు వారు తిరిగి మాదకద్రవ్యాల వైపు వెళ్లకుండా కౌన్సెలింగ్, పునరావాసం, పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మహిళలకు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్, వేగవంతమైన స్పందన, రిపీట్ అఫెండర్లపై నిఘా పెంచాలని సూచించారు. విద్యాసంస్థలు, కార్యాలయాలు, మహిళా శిశు సంక్షేమ శాఖలతో సమన్వయాన్ని బలోపేతం చేయాలని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు 1,122 నుంచి 557కు తగ్గి 50.4 శాతం క్షీణించగా, ప్రమాద మరణాలు 426 నుంచి 285కు తగ్గాయని, 33.1 శాతం తగ్గుదలతో 141 ప్రాణాలను కాపాడగలిగామని చెప్పారు. అయినప్పటికీ 285 మరణాలు 285 కుటుంబాలకు తీరని విషాదమని, ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా చూడటమే తదుపరి లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి తీవ్రమైన ప్రమాదాన్ని నమగ్రంగా విశ్లేషించి ప్రమాద స్థలానికి పోలీసులు, అంబులెన్స్, రోడ్ సేఫ్టీ, ఎన్కెచ్ రెస్పాన్స్ వాహనాలు చేరుకున్న సమయం, రహదారి లోపాలు, లైటింగ్, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, హెల్మెట్ వినియోగం తదితర అంశాలను పరిశీలించాలని ఆదేశించారు. ఒకే కారణంతో అదే ప్రాంతంలో ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆపరేషన్ త్రిశూల్ సమన్వయ కమిటీ కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, ప్రతి నెలా ఫలితాలను సమీక్షించాలని సూచించారు. డ్రగ్ పాజిటివిటీ, పునరావాసం పొందిన వారి పరిస్థితి, మహిళా భద్రతా ప్రాంతాల్లో నేరాల సంఖ్య, అత్యవసర స్పందన సమయం, బ్లాక్ స్పాట్లలో ప్రమాదాలు, మరణాలు వంటి ఫలితాలను ప్రాతిపదికగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రతి కుటుంబానికి భరోసాగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. సీపీ ఎస్పి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ 2024 ఆగస్టు--2025 జూలైతో పోలిస్తే 2025 ఆగస్టు- 2026 జూలై మధ్య మొత్తం నేరాలు 6,814 నుంచి 5,692కు తగ్గాయని, 16.5 శాతం క్షీణత నమోదైందని తెలిపారు. ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో ఎన్డీపీఎస్ కేసులు 86 నుంచి 16కు తగ్గి 81.4 శాతం క్షీణత సమోదైందన్నారు. డ్రగ్స్ వినియోగంపై 5,663 మందికి పరీక్షలు నిర్వహించగా 1,287 మందిలో గంజాయి వినియోగం పాజిటివ్‌గా తేలిందని, 907 మందికి కౌన్సెలింగ్, పునరావాసం కల్పించగా 794 మంది తదుపరి పరీక్షల్లో నెగెటివ్‌గా నమోదయ్యారని వివరించారు. మహిళలపై నేరాలు 1,281 నుంచి 1,092కు తగ్గి 14.8 శాతం క్షీణత నమోదైందన్నారు. యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచడం, మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడం, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించడమే ఆపరేషన్ త్రిశూల్ లక్ష్యాలని తెలిపారు. అనంతరం కలెక్టర్, సీపీ త్రిశూల్ ప్రచార గోడపత్రికను ఆవిష్కరించి ప్రచార రథాన్ని ప్రారంభించారు. అధికారులు, పోలీసు సిబ్బందితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీసీపీలు కేజీవీ నరిత, జి. రామకృష్ణ, డీఎంహెచ్ ఓ డా. ఏ. శ్రవణ్‌బాబు, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా బేగం, పోలీస్, రవాణా, వైద్య శాఖల అధికారులు, ఈగల్, త్రిశూల్ బృందాల ప్రతినిధులు పాల్గొన్నారు.