ఊహలు గుసగుసలాడే చిత్రంలో ప్రభా క్యారెక్టర్ తో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న రాశి ఖన్నా తర్వాత అక్కినేని ఫ్యామిలీ ప్రెస్టేజియస్ మూవీ మనం సినిమాలో అతిధి పాత్ర పోషించి, అందరి దృష్టిని తన వైపు లాగేసుకుంది. వరుసగా స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు అందుకుంటూ మరింత ప్రజాదారణ పొందిన ఈమె.. ఈ మధ్యకాలంలో కాస్త జోరు తగ్గించినా... మళ్లీ ఇప్పుడు స్పీడ్ పెంచింది. ఒకవైపు సినిమాలు, మరొకవైపు ఈవెంట్లు అంటూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని డెటాల్ బనేగా స్వస్ట్ ఇండియా సీజన్ 13 లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఈమె ఆరోగ్యం, పరిశుభ్రతపై తన అభిప్రాయాలను పంచుకుంది. ముఖ్యంగా తనకు పరిశు భ్రత పాటించే అలవాటు తన తల్లి ద్వారా వారసత్వంగా వచ్చింది అంటూ రాశి ఖన్నా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. "ఆరోగ్యం అనేది మనం ఉండే ఇల్లు.. అలాగే మన చుట్టూ ఉండే పర్యావరణంతో ముడిపడి ఉ ంటుంది. సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి సోషల్ మీడియా ఒక గొప్ప సాధనం.. ఒక చిన్న పోస్ట్ ద్వారా లక్షలాది మందికి అవగాహన కల్పించవచ్చు' అంటూ తన అభిప్రాయంగా పంచుకుంది రాశి ఖన్నా. ఇకపోతే ఈ వేడుకలో పాల్గొన్న రాశి ఖన్నా అందుకు సంబంధించిన ఫోటో స్టిల్స్ ను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె కట్టుకున్న చీర అందరి దృష్టిని ఆకట్టుకుంది. డిజైనర్ బ్రాండ్ 369 కు సంబంధించిన శారీని ధరించింది.. తెలుపు రంగు బేస్ పై అందమైన నీలం రంగు ప్రింట్లతో చక్కగా అంచులతో డిజైన్ చేసిన శారీ ని కట్టుకుంది.. దీనికి కాంబినేషన్ లో నెక్ లైన్ వద్ద సి3 డిజైన్ కలిగిన స్లీవ్ లెస్ బ్లౌజు ధరించింది.