తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతల సంక్షేమం, టైటిళ్ల నమోదు ప్రక్రియలో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పాత్ర అత్యంత కీలకమైనదని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలోని నిర్మాతల ఎదుర్కొంటున్న దాదాపు 99 శాతం సమస్యలను గిల్డ్ కంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిలే విజయవంతంగా పరిష్కరించిందని తెలిపారు. చెరుకూరి సుధాకర్ కోరగానే వై.వి.ఎస్. చౌదరి అమెరికాలో ఉండి కూడా-దనరా- టైటిల్ను బదిలీ చేయడం, సమంత నటించిన మా ఇంటి బంగారం-, -కొరియన్ కనకరాజు-, -ఇరుముడి-, కమల్ హాసన్ - విక్రమ్: హిట్ లిస్ట్-, -సీతారామం, అలాగే భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రమైన -కల్కి 2898 vణ- వరకు ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలు కౌన్సిల్ ద్వారానే టైటిల్ ప్రక్రియ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధించాయని గుర్తుచేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సంచలనాత్మక చిత్రం - వారణాసి- టైటిల్ వివాదం సునాయాసంగా ముగియడం వెనుక కౌన్సిల్ కృషి ఎంతో ఉందని ప్రసన్న కుమార్ వెల్లడించారు. ఈ -వారణాసి- అనే టైటిల్ను ముందుగా ఒక చిన్న డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. అయితే కౌన్సిల్ ప్రతినిధులు సదరు నిర్మాతతో సామరస్యంగా మాట్లాడగా.. ఆయన సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు కి అభిమాని కావడంతో పాటు.. ఈ చిత్రం భారతీయ సినిమా ప్రతిష్టను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్ట్ అని గుర్తించి.. ఎంతో ఉదారతతో ఈ టైటిల్ను నిర్మాత కేఎల్ నారాయణ గారికి అప్పగించారని వివరించారు. ఈ అత్యంత భారీ బడ్జెట్ సినిమా కూడా కౌన్సిల్ నుంచే ముందడుగు వేసిందని.. ఇది కౌన్సిల్ సాధించిన మరో పెద్ద విజయమని ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమలోని చిన్న నిర్మాతలు- ఎగ్జిబిటర్ల ప్రయోజనాల కోసం వెటరన్ నిర్మాత చదలవాడు శ్రీనివాసరావు చేసిన సేవలను ప్రసన్న కుమార్ కొనియాడారు. థియేటర్ల వ్యవస్థను కాపాడుకునేందుకు.. చిన్న సినిమాలకు ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు, పన్ను మినహాయింపులు వచ్చేలా ఆయన ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా కరోనా పాండమిక్ సమయంలో స్వయంగా తన సొంత నిధులతో వేలాది మంది సినీ కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు మరియు అత్యవసర ఆర్థిక సాయం అందించిన మహోన్నత వ్యక్తి అని గుర్తుచేశారు. అటు విలేకరులకు (జర్నలిస్టులకు) ప్లాట్లు అందించే ప్రణాళికతో పాటు.. సినీ ఇండస్ట్రీ డైరెక్టర్లకు నిరంతరం అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు.