టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. విజువల్స్, యాక్షన్ సీన్ల గురించి సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతుండగా, మరోవైపు ఈ సినిమాకు అసలైన బలం అజయ్-అతుల్ అందించిన సంగీతమేనని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే విడుదలైన 'ఎందయ్యా 'సామి' పాట చార్ట్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా అసలైన విజయాన్ని డిసైడ్ చేసే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యాజిక్ ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ ప్రముఖ సంగీత ద్వయం అజయ్- అతుల్‌కు పీరియాడిక్ మరియు డివైన్ కంటెంటు తమ మ్యూజిక్ తో ఎలివేట్ చేయడంలో ప్రత్యేకమైన ట్రాక్ రికార్డ్ ఉంది. 'ఆదిపురుష్’ లాంటి సినిమాలు కంటెంట్ పరంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, వారు అందించిన నేపథ్య సంగీతం, పాటలు ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేశాయి. ఇక ఆ సినిమాలో మ్యూజిక్ మాత్రమే ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేసిందనే ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు 'రణబాలి' విషయంలోనూ అలాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ సినిమాలకు కేవలం గ్రాఫిక్స్, భారీ సెట్లు మాత్రమే సరిపోవు. ఆ నాటి కాలాన్ని, డ్రామాను ఆడియన్స్‌కు అనుభూతి చెందేలా చేయడంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక 19వ శతాబ్దపు బ్రిటీష్ కాలం నాటి పోరాటాలను, రాయలసీమ గ్రామీణ నేపథ్యాన్ని ప్రతిబింబించేలా అజయ్-అతుల్ లైవ్ ఆర్కెస్ట్రా మరియు జానపద ధ్వనులను ఉపయోగించారు.