ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి, : స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బీసీలకు 34 శాతం కాకుండా 40 శాతానికి పైగా స్థానాలు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగు దశాబ్దాలుగా బీసీల రాజకీయ ఎదుగుదలతో పాటు సామాజిక, ఆర్ధిక పురోగతికి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఎన్డీయే కూటమి భాగస్వామ్య వక్షాల సహకారంతో బీసీలకు అధిక ప్రాతినిధ్యం కల్పించడం శుభవరిణామమన్నారు. గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాన్ని జగన్ కేసులు వేసి అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించి రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. బీసీల పట్ల ఎన్డీయే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ చూపుతున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలుపుతూ పలువురు బీసీ నాయకులు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని కలిసి దుశ్శాలువాతో సత్కరించి విఘ్నేశ్వరుని దారు శిల్పాన్ని బహూకరించారు. తన తండ్రి దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యతను కొనసాగిస్తూ తాను కూడా వారికి అధిక సంఖ్యలో స్థానాలు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.సమాజంలోని బీసీల అభివృద్ధితోనే దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని, ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు టీడీపీ బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ , అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, విశ్వబ్రాహ్మణ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ జి. దశరథాచారి, పన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి . కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం. ఉమేష్ రావు, క్లస్టర్ ఇన్చార్జి పేట బాలాజీ రెడ్డి, ఢిల్లీ బాబు, బీమాల మునికృష్ణ, మునిరాజా యాదవ్, కన్నావరం హరిబాబు భాస్కర్ గౌడ్, నాగరాజు, కోట చంద్రశేఖర్, ఎం.ఎస్. రెడ్డి, మురళి, రామచంద్రయ్య, సిద్ధులయ్య, పూల శేఖర్, శంకరయ్య, గాజుల భగత్, గగన్ యాదవ్, సులేమాన్, శివ ఆచారి, శేషు, బాబు రెడ్డి, ఓంకార్, చంద్రశేఖర్, రమేష్, మణెయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.