టీడీపీ వైసీపీ మధ్య చెలరేగిన ఘర్షణ
దూసుకొచ్చిన మిధున్ రెడ్డి కాన్వాయి
గాయపడిన పలువురు తెదేపా కార్యకర్తలు
తిరగబడిన తెలుగు తమ్ముళ్లు ఎంపీ మిధున్‌రెడ్డి,
గన్‌మెన్‌కు గాయాలు పుంగనూరు, రాయచోటి, ధర్మవరం,
తిరుపతిలో ఉద్రిక్తత పల్నాడులోనూ స్థానిక దుమారం
అమరావతి, : స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాయలసీమలో రాజకీయ సెగ రగులుకుంది.. నామి నేషన్ల ఘట్టం తొలిరోజే అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణలు చెలరేగాయి.. పరస్పర దాడులతో ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా గాయపడ్డారు.. వుంగనూరు, రాయచోటి, ధర్మవరం, తిరుపతి పట్టణాల్లో నామినేషన్ల సందర్భంగా ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి.. పుంగనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా కాన్వాయిలో వస్తుండగా ఓ వాహనం దూసుకు రావటంతో వలువురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి.. దీంతో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు తిరగబడి ఎంపీ కాన్వాయిపై దాడి చేశారు.. ఈ దాడిలో ఎంపీ మిథున్‌రెడ్డి, గన్మెను గాయాలయ్యాయి.. మిథున్‌రెడ్డి కాన్వాయి వాహనాల్లో మద్యం బాటిళ్లు, పెట్రోల్ బాంబులు, కత్తులు, కర్రలు, ఇతర మారణాయుధాలు ఉన్నాయని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందుగా వేనుకున్న పథకం ప్రకారమే మిథున్‌రెడ్డి తన అనుచరులతో టీడీపీ కార్యకర్తలను భయ భ్రాంతులకు గురిచేయటంతో పాటు మారణాయుధాలతో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారని టీడీపీ ఆరోపం చింది. వాహనాలను అతివేగంగా దూసుకు వచ్చేలా నడిపా రని దీనివల్ల తమ కార్యకర్తలకు గాయాలయ్యారని పోలీసు లకు ఫిర్యాదు చేసింది.. కాగా చైసీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్న నేపథ్యంలో అదేమని ప్రశ్నించేందుకు వెళ్లిన ఎంపీ మిథున్ రెడ్డిపై వుంగనూరులో టీడీపీ కార్యకర్తలుగూండాలు కత్తులు, కర్రలతో దాడులు జరిపి హత్యాయత్నా కి పాల్పడ్డారని వైసీపీ ఫిర్యాదు చేసింది.. ఇరువర్గాల కార్యకర్త లు, ద్వితీయశ్రేణి నాయకులు ఈ సందర్భంగా రాళ్లు రువ్వు కున్నారు.. మూడు వాహనాలు ఈ ఘర్షణలో ధ్వంసంచేసి నిప్పంటించారు. రాయచోటి లో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నామినేషన్ల దాఖలుకు అనుచ రులతో తరలిరావటంతో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చెలరేగింది.. ఈ సందర్భంగా గుర్తుతెలియని వ్యక్తులు మూడు వాహనాలను దగ్ధం చేశారు. పరిస్థితి చేజారటంతో పోలీసులు భారీగా మొహరించారు.. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా తిరువతిలో వైసీపీ మహిళా అభ్యర్థి చేతిలో నుంచి నామినేషన్ పత్రాలను టీడీపీ కార్యకర్తలు లాక్కుని చించివేశారని వైసీపీ ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. కడవలో మాజీ కార్పొరేటర్ బాల స్వామిరెడ్డి రిటర్నింగ్ అధికారికి నామినేషను సమర్పిస్తూంది డగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని పాటు దాడి చేశారని వైసీపీ ఆరోపించింది. ధర్మవరంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు సాయికుమార్, పుష్పమణిపై టీడీపీ, బీజేపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దాడిలో ఆరుగురు కార్యకర్తలకు గాయాలైనట్లు సమాచారం, కాగా వల్నాడు జిల్లా దాచేపల్లిలో మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి కొప్పుల రవికుమార్ కారు పార్కింగ్ స్థలంలో మద్యం బాటిళ్లు పంపిణీ చేస్తున్నారనే అభియోగాలతో పోలీసులే నామినేషన్ వేయకుండా అడ్డుక ఎన్నారని మాజీ ఎమ్మెల్యే కాను మహేష్‌రెడ్డి ఆరోపించారు.
ఎస్ఈసీకి వరస్పర ఫిర్యాదులు
ఇదిలా ఉండగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్నివిధాల ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టించి అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు. చేసింది. తమిళనాడు, కర్నాటక రౌడీలతో ఏపీలో ఎంపీ మిథున్ రెడ్డి అల్లర్లను ప్రేరేపించారని.. రాయలసీమలో వైసీపీ హింసాత్మక ఘటనలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు. ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఆధ్వర్యంలో ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ విధ్వంసంపై ఎస్ సీకి వర్ల రామయ్య వర్చూరి ఆశోక్ బాబు, కుప్పం రాజశేబర్ ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి గూండాలతో దాడికి తెగబడ్డ వీడి యోల పెన్ డ్రైవ్ ను ఎస్ఈనీకి అందజేశారు. ఏపీలో కుట్రలు సృష్టించి, శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.వుంగనూరు లో అన్ని కార్లతో ఎంపీ మిథున్ రెడ్డి నామినేషన్ వేయడానికి రావడమేంటీ? ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలను మిధున్ రెడ్డి కార్లతో తొక్కించారని వైసీపీ గ్యాంగ్ దాడులు చేస్తే సహించేదిలేదని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి ఖండించారు. గాయపడిన కార్యకర్తలను ఆస్పత్రిలో ఆయన పరామర్శించారు.
కేంద్ర బలగాలకై హైకోర్టులో వైసీపీ పిటిషన్
రాయలసీమతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర భద్రతా బలగాలను రాష్ట్రానికి పంపేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఎంపీ మిశున్రెడ్డిపై హత్యాయత్నం జరిగిందని దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేలా పోలీసులను ఆదేశించాలని కోరింది.
రాష్ట్రవతి, సీజేఐ, కేంద్రం లేఖలు
వుంగనూరులో లోకసభ సభ్యుడు మిథున్ రెడ్డిపై విచారణ జరపాల్సిందిగా వైసీపీ జాతీయ మానవ హక్కుల కమిషన్(హెచ్ఎర్సీ) తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లేబలు రాశారు. ఈ ఘటనను పార్లమెంటరీ ప్రత్యేక హక్కుల ఉల్లంఘనగా పరిగణించి ప్రివిలేజెస్ కమిటీతో విచారణ జరిపించాలని కోరారు.