సర్జికల్ స్ట్రయిక్స్ జరిగి పదేళ్లు
తీవ్రవాదంపై జీరో టాలరెన్స్ భారత్ విధానం
జనగణనలో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత
కోచ్ రాజీందర్ సింగ్ మాదిరి గ్రామీణ క్రీడా ప్రతిభను అన్వేషిద్దాం
అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా స్వచ్ఛత కార్యక్రమాలు చేపడదాం
వారసత్వ సంపదను కాపాడుకుందాం
న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రయిక్స్‌ను ఉగ్రవాదానికి ఒక నిర్ణయాత్మక ప్రతిస్పందనగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అభివర్ణిం చారు. ఈ ఆపరేషన్ భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక విధానాని కి ప్రపంచం ముందు ఒక ధైర్యమైన కొత్త ఉదాహర ణను నిలిపిందని ఆయన అన్నారు. ఉ గ్రవాదం పట్ల భారతదేశం జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని నొక్కిచెబు తూ.. ఉగ్రవాదాన్ని బలంగా, నిర్ణయాత్మకంగా ఎదుర్కొంటా మని దేశం స్పష్టం చేసిందన్నారు. తన నెల చివరి ఆదివారం ప్రసారమయ్యే రేడియో ప్రసార కార్యక్రమం మన్ కీ బాత్ 138వ ఎపిసోడ్లో ప్రధాని మోడీ ప్రసంగించారు. గత దశాబ్ద కాలంలో- బాలాకోట్ వైమానిక దాడి నుంచి ఆపరేష ససింధూర్ వరకు- ఉగ్రవాదులు దేశంపై కన్నెత్తి చూడటానికి సాహసిస్తే, వారికి తగిన ప్రతిన్పందన ఉ ంటుందని భారతదేశం పదేపదే స్పష్టమైన సందేశం పంపిందని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి భారతదేశ ధైర్యవంతులైన సైనికులు నియంత్రణ రేఖను దాటిన తీరును చూసి ప్రపంచం ఆశ్చర్యపోయిందని మోడీ చెప్పారు. సర్జికల్ (స్ట్రైక్స్ చేపట్టి పదేళ్లు పూర్తవుతున్న విషయాన్ని కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇదే సమయంలో 2001 సెప్టెంబర్ 11 అమెరికా ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారినికూడా మోడీ న్మరించారు. ఢిల్లీ, ముంబైలో జరిగిన ఉగ్రదాడుల కారణంగా భారత్ దశాబ్దాలుగా ఎదుర్కొన్న నష్టాన్ని పేర్కొన్నారు.
జనగణనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం
జనగణనను ప్రతి పౌరుడి సమష్టి జాతీయ బాధ్యతగా ప్రధాని మోడీ అభివర్ణించారు, జనగణన తొలి దశలో దేశవ్యాప్తంగా 32 కోట్లకు పైగా కుటుంబాల వివరాలను నమోదు చేసినట్లు తెలిపారు. లడబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తరా ఖండ్‌లోని మంచుతో కూడిన మారు మూల ప్రాంతాల్లోనూ జనగణన ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ప్రజలు స్వయంగా తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకునే సెల్ఫ్-ఎన్యూమరేషన్ నదుపాయాన్ని ఉపయోగించు కోవాలని సూచించారు.
గ్రామీణ క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత కార్యక్ర మాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని మోడీ కోరారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో యువత, స్థానిక ప్రజలు చేపడుతున్న నదుల శుభ్రత, చెరువులు-బావుల పునరుద్ధరణ, బీచ్ క్లీనింగ్, చెత్త వేరు చేసే కార్యక్రమాలను ప్ర స్థావించారు. గ్రామాలు, చిన్న పట్టణాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీయాల్సిన అవసరాన్ని మోడీ ప్రస్తావించారు. మాజీ హాకీ క్రీడాకారుడు, కోచ్ రాజీందర్ సింగ్ నిర్వహి స్తున్న ప్రతిభా అన్వేషణ కార్యక్రమాలను ఉదాహరణగా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు హాకీ శిక్షణ, మౌలిక వనతులు అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వివరించారు. యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉ ంచేందుకు చేపడుతున్న నషా ముక్తో యువ అభియాన్‌ను ప్రధాని ప్రస్తావించారు. మై భారత్ వాలంటీర్లు, ఎన్‌ఎస్‌ఎస్‌ఈ సభ్యులు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు ఈ కార్యక్రమం లో పాల్గొంటున్నట్లు తెలిపారు.
మహిళా స్వయం సహాయకు సంఘాలకు ప్రోత్సాహం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్గ్రేడ్ ఉసిరి ఆధారిత ఉత్పత్తులను ప్ర స్థావిస్తూ స్థానిక ఉత్పతులకు కొత్త మార్కెట్లు కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాని వివరించారు. మహిళా స్వయం. సహాయక సంఘాలు ఉసిరి క్యాండీ, జ్యూస్, టోరగాయలు. ఇతర ఉత్పత్తులను తయారు చేస్తూఆదాయం పొందుతు న్నాయని తెలిపారు. స్థానిక ఉ తృత్తులను ప్రోత్సహించాలని, వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.
పోషకాహారం, పర్యావరణ వరిరక్షణ
పోషణ్ మాసం సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలను కూడా మోదీ ప్రస్తావించారు. మునగాకు వినియోగం, చిరుధాన్యాలతో పోషకాహారం, పోషణ్ వాటి కలు వంటి కార్యక్రమాలను వివరించారు. అలాగే అసోం లోని ఏనుగులు, పిగ్మీ హాగ్‌ల సంరక్షణ, పశ్చిమ బెంగాల్ సుందరున్స్లో మహిళలు చేపడుతున్న మడ అడవుల పెంపకం వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు.