కానీ మా దగ్గర ప్రతిభ ఉంది: సంజూ శాంసన్
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్‌లో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 24 వరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఈ ఓటమి అనంతరం వికెట్ కీవర్ బ్యాటర్ సంజూ శాంసన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, ఆయన లేని లోటు బౌలింగ్ విభాగంలో స్పష్టంగా కనిపిస్తోందని అంగీకరించాడు. ఆసియా క్రీడల తర్వాత వర్క్స్డ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై శాంసన్ మాట్లాడుతూ.. "జస్ప్రీత్ బుమ్రా ఒక తరం గర్వించదగ్గ బౌలర్. అలాంటి ఆటగాడు జట్టులో ఉండటం మన అదృష్టం. ఆయనకు ప్రత్యామ్నాయం ఉండదు. కానీ, మన జట్టులోకి మంచి ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లు వస్తున్నారు. అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అలాగే గత కొన్ని మ్యాచ్‌లలో ప్రిన్స్ యాదవ్ కూడా ఆకట్టుకుంటున్నాడు. వారికి మనం ఎంత ఎక్కువ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తే, వారు అంతగా రాటుదేలుతారు" అని వివరించాడు. బ్యాటింగ్ చేస్తూ గాయపడిన అర్షదీప్ గురించి మాట్లాడుతూ.. "అతను భుజానికి బస్ పెట్టుకుంటున్నాడు. త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాను" అని తెలిపాడు. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అద్భుత ఫామ్‌ను శాంసన్ ప్రశంసించాడు. "హోప్ చాలా బాగా ఆడుతున్నాడు. అతని ఆటను మనం గౌరవించాలి. పెద్దగా రిస్క్ తీసుకోకుండా, మంచి క్రికెటింగ్ షాట్లతో బౌలర్లను గౌరవిస్తూ పరుగులు చేస్తున్నాడు. అతడి బ్యాటింగ్‌కు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. ప్రతి మ్యాచ్‌లో అతడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై మేం దృష్టి సారిస్తున్నాం" అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ.. 17వ ఓవర్లో తిలక్ వర్మ ఔట్ కావడమే కీలక మలుపు అని శాంసన్ అభిప్రాయపడ్డాడు. "తిలక్ ఔట్ అయ్యే వరకు మేం లక్ష్య ఛేదనలో సరైన మార్గంలోనే ఉన్నాం. ఓవర్‌కు 10-12 పరుగులు సులభంగా రాబడుతున్నాం. ఒత్తిడిలోనూ నితీశ్ రెడ్డి, తిలక్ వర్మ అద్భుతంగా ఆడారు" అని కొనియాడాడు. ఇదే సమయంలో ఫామ్ కోల్పోయిన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలకు అండగా నిలిచాడు. "ఇషాన్, అభిషేక్ ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనర్లు, ఒక మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన ఆందోళన అవసరం లేదు. గత మ్యాచ్‌లోనే అభిషేక్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ నిలకడగా రాణిస్తున్నాడు" అని వారికి మద్దతుగా నిలిచాడు.