పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా,
ప్రశాంతంగా నిర్వహించాలి జాయింట్ కలెక్టర్
ఆర్. గోవిందరావు, మున్సిపల్ కమిషనర్ ఎం. జయకృష్ణ
తిరుపతి, : మున్సిపల్ సాధారణ ఎన్నికలు 2026లో భాగంగా ఈ నెల 28న నిర్వహించనున్న పోలింగ్ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలని జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, మున్సిపల్ కమిషనర్ ఎం. జయకృష్ణ స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో బుధవారం ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడు తూ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ప్రిసైడింగ్ అధికారులు తప్పనిసరిగా పీఓ డైరీని వినియోగించాలని, ఎన్నికల విధులకు సంబంధించిన కరదీపికను క్షుణ్ణంగా చదివి అందులోని నిబంధనలు, విధానాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి అధికారి తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడాలని స్పష్టం చేశారు. శిక్షణ కార్యక్రమంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల విధులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఓటర్లకు అవసరమైన సౌకర్యాల కల్పన, ఎన్నికల సామగ్రి నిర్వహణ తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. బ్యాలెట్ బాక్సుల వినియోగం, పోలింగ్ ప్రారంభానికి ముందు చేపట్టాల్సిన తనిఖీలు, బాక్సులకు సీలు వేయడం, వాటి భద్రత, రవాణా, పోలింగ్ ముగిసిన అనంతరం సంబంధిత అధికారులకు అప్పగించే విధానాలను వివరించారు. ఎన్నికల సమయంలో ప్రతి దశలోనూ నిర్దేశిత నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది విధుల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఓటర్లు ఎలాంటి ఇబ్బం దులు ఎదుర్కోకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్, మున్సివల్ కమిషనర్ తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత వాతావర ణంలో ఎన్నికలు నిర్వహించెందుకు ప్రతి ఒక్కరూ సమష్టి గా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.