ప్రపంచకప్ జట్టుపై గిల్ కీలక ప్రకటన!
వన్డే ప్రపంచకప్‌కు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో ఇక ప్రయోగాలకు స్వస్తి పలకాలని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భావిస్తున్నాడు. వచ్చే సిరీస్ నుంచే ప్రపంచకప్‌లో ఆడించాలనుకుంటున్న జట్టుతో బరిలోకి దిగాలని స్పష్టం చేశాడు. ఆటగాళ్ల గాయాలు, ఇతర టోరీల షెడ్యూల్ కారణంగా పూర్తి స్థాయి జట్టుతో ఆడలేకపోయామని తెలిపాడు. అయితే ఈ పరిస్థితి కొత్త ఆటగాళ్లకు తమ సత్తా నిరూపించుకునే మంచి అవకాశాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. అయితే చివరి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆసియా క్రీడల్లో స్వర్ణం నిలబెట్టుకునేందుకు భారత్ పూర్తి స్థాయి టీ20 జట్టును పంపడంతో పలువురు కీలక వన్డే ఆటగాళ్లు ఈ సిరీస్ కు దూరమయ్యారు. జన్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆసియా క్రీడల్లో పాల్గొన్నారు. హార్దిక్ పాండ్యా, ప్రసిద్ధ కృష్ణ, హర్షిత్ రాణా గాయాలతో అందుబాటులో లేకపోయారు. దీంతో రుతురాజ్ గైక్వాడ్, సమన్ ధీర్, అసుల్ కాంబోజ్, ఆకిబ్ నబీ వంటి ఆటగాళ్లకు అవకాశాలు దక్కాయి. నితీశ్ కుమార్ రెడ్డి, గుర్నూర్ బ్రార్ పంటి యువ ఆటగాళ్లను కూడా ప్రపంచకప్ కోసం సిద్ధం చేస్తున్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను చాటుకోవాలని గిల్ సూచించాడు. అయితే ఇకపై ప్రయోగాలకు ఎక్కువ సమయం లేదని గిల్ స్పష్టం చేశాడు. వచ్చే న్యూజిలాండ్ పర్యటన నుంచి అందుబాటులో ఉన్న ప్రధాన ఆటగాళ్లతోనే ఐరిలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఆ పర్యటనలో ఐదు వన్డేలు, ఐదు టీ20లు, రెండు. టెస్టులు జరగనున్నాయి. ప్రపంచకప్‌లో ఆడించే జట్టును ఇప్పటి సుంచే సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉ ందన్నాడు. వెస్టిండీస్ సిరీస్‌లోలో ఆరంగేట్రం చేసిన అనుల్ కాంబోజ్, ఆకిబ్ నబీలకు గిల్ మద్దతుగా నిలిచాడు. పరుగులు నమర్పించుకున్నప్పటికీ వారిద్దరికీ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పాడు. అన్షుల్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగలగడం జట్టుకు కీలకమని అభిప్రాయపడ్డాడు.
2027 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అత్యంత కీలకం
దినేశ్ కార్తీక్
2027 వన్డే ప్రపంచకప్ లో భారత జట్టుకు సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ సేవలు అత్యంత కీలకం కానున్నాయని టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ అపారమైన అనుభవం, ప్రస్తుత ఫామ్ జట్టుకు అతిపెద్ద బలమని, ముఖ్యంగా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు అతని మార్గదర్శకత్వం ఎంతో అవసరమని కార్తీక్ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్ ను దినేశ్ కార్తీక్ ఉదాహరణగా చూపించాడు. గువాహటిలో జరిగిన మ్యాచ్‌లో ఛేజింగ్ సమయంలో రోహిత్ శర్మ సాధించిన సెంచరీ అతని ఫామ్క నిదర్శనమని ప్రశంసించాడు. ఆటలో ఎదురయ్యే తీవ్ర ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కోవడంలో రోహిత్ అనుభవం గిలక్కు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నాడు. ఈ విషయంపై కార్తీక్ మాట్లాడుతూ.. "ఒక కెప్టెన్‌గా, నాయకుడిగా ఆటలో ఉత్కంఠభరితమైన క్షణాల్లో రోహిత్ ఇచ్చే సలహాలు అమూల్యమైనవి. ముఖ్యంగా ఒక పెద్ద మ్యాచ్‌లో, కెప్టెన్ శు భ్‌మన్ గిల్ కచ్చితంగా రోహిత్ వైపే చూస్తాడని, అతనిపైనే ఆధారపడతాడని నేను భావిస్తున్నాను" అని స్పష్టం చేశాడు.సీనియర్ ఆటగాడిగా, మాజీ కెప్టెన్‌గా జట్టులో రోహిత్ పోషించే పాత్ర కీలకమని పేర్కొన్నాడు. కాగా, వన్డే ఫార్మాట్లో తనకు ఇంకా 'పని మిగిలి ఉంది' అని, 2027 ప్రపంచకప్‌లో ఆడాలనే తన కోరికను రోహిత్ శర్మ ఇటీవల బహిరంగంగా వెల్లడించాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నమెంట్లో ఆడటమే లక్ష్యంగా హిట్ మ్యాన్ ముందుకు సాగుతున్నాడు. వన్డేల్లో నిలకడగా పరుగులు సాధిస్తుండటంతో, రాబోయే ప్రపంచకప్ కోసం భారత జట్టు రూపొందించే ప్రణాళికల్లో రోహిత్ శర్మ కేంద్ర బిందువుగా కొనసాగుతున్నాడు.