అంతర్జాతీయ చట్టాల పరిధి పెంచి బాధితుల స్వరమైన నవనీతం
ఓస్లో: భారతీయ మూలాలు కలిగిన దక్షిణాఫ్రికాకు చెందిన న్యాయ కోవిదురాలు నవనీతం పిళ్లైను (నవీ పిళ్లై) ప్రతిష్టాత్మక శాంతి నోబెల్ వరించింది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రచారం, పరిరక్షణకు అందించిన విశేష సేవలకుగాను 2026 సంవత్సరానికి ఆమెను ఈ అవార్డుకు నార్వే నోబెల్ కమిటీ ఎంపిక చేసింది. అప్పటివరకు దేశాలకే పరిమితమైన జాతుల హననం, మహిళలపై లైంగిక హింసకు సంబంధించిన అంశాలపై అంతర్జాతీయ చట్టాలు దృష్టి పెట్టి, వాటికి ఒక రూపం ఇవ్వడంలో ఆమె కృషిని కమిటీ శ్లాఘించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలిగా, ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిన్ (రువాండా) న్యాయమూర్తి హోదాలో మానవ హక్కుల భావన విస్తరణకు, శాంతి సాధనకు తోడ్పాటు అందించారని తెలిపింది. హింస, యుద్ధాలకు బాధితులైన వారి పక్షాన, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు కట్టుబడి నవీ పిళ్లై పనిచేశారని పేర్కొంది. శాంతి ప్రపంచం చట్టాలు సరిగ్గా పనిచేసినప్పుడే సాధ్యమని ఆమె బలంగా నమ్మారని నోబెల్ కమిటీ కొనియాడింది.
పేదరికం, జాతి వివక్షతో పోరాటం..
నవీ పిళ్లై 1941 సెప్టెంబరు 23న దక్షిణాఫ్రికాలోని ధర్బన్లో జన్మించారు. తల్లిదండ్రులు నారాయణసామి నాయుడు, శాంతమ్మ, నవీ జన్మించడానికి ముందే ఆమె తాతయ్య నిర్బంధ కూలీగా తమిళనాడు నుంచి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తండ్రి బస్ డ్రైవరు సహా అనేక వృత్తులు చేశారు. దారిద్య్ర్యం, వర్ణ వివక్ష వాతావరణంలో నవీ వీళ్లై పెరిగి పెద్దయ్యారు. ఆమెతో కలిపి మొత్తం 8మంది పిల్లల పోషణ ఆ పేద కుటుంబానికి కష్టంగా ఉండేది. కానీ, నవీ కష్టపడి చదివి నల్ల జాతికి చెందిన తొలి న్యాయవాదిగా ఎదిగారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి లా పట్టా తీసుకుని దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన ఆమెకు అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. వాటన్నింటినీ తట్టుకుంటూ, నాతల్ ప్రావిన్సీలో న్యాయవాదిగా 1967లో వృత్తి జీవితం ప్రారంభించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న పోరాటాలకు న్యాయ గొంతుకగా మారారు. న్యాయవాదిని పెట్టుకునే హక్కు ఆమె చేసిన పోరాటం వల్లే అక్కడి రాజకీయ ఖైదీలకు లభించింది. జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నవారి కేసులను ఆమె వాదించారు. జాతీయ మహిళా సంకీర్ణ సమితి సభ్యురాలిగా, వివక్షను నిషేధిస్తూ, రాజ్యాంగంలో కొత్తగా సమానత్వ నిబంధనను పొందుపరచడంలో కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష రద్దయిన తర్వాత, 1995లో హైకోర్టు న్యాయమూర్తిగా నవీ పిళ్లై బాధ్యతలు తీసుకున్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో 2008-14 వరకు న్యాయ సేవలు అందించారు. అంతర్జాతీయ క్రిమినల్ ట్రైబ్యునల్(రువాండా వ్యవహారాలు) అధ్యక్షురాలిగా, అంతర్జాతీయ క్రిమికల్ కోర్టు న్యాయమూర్తిగా, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం హై కమిషనర్గా కీలక మిషన్లలో భాగమయ్యారు.
ట్రంప్ అవార్డు వంచుకుంటా.... నవీ పిళ్లై నరదా వ్యాఖ్య
శాంతి నోబెల్ ప్రకటించినప్పుడు నవీ పిళ్లై జర్మనీలోని నూరెంబర్గ్ నగరంలో ఉన్నారు. ఆమెను కలిసి మీడియా అభినందించిన సందర్భంలో, తనకే శాంతి నోబెల్ రావాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న ప్రకటనల అంశం ప్రస్తావనకకు వచ్చింది. దీనిపై ఆమె సరదాగా స్పందించారు. "మీరు మరింతగా భుజం తడితే, ట్రంప్ కలిసి నేను అవార్డును వంచుకోవచ్చు." అని వ్యాఖ్యానించారు.