టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో దూసుకుపోతూ తన మార్కెట్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తున్నారు. ఇటీవలే విడుదలైన 'ది ప్యారడైజ్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న నాని, వెంటనే తన తదుపరి గ్యాంగ్ స్టర్ డ్రామా 'బ్లడీ రోమియో' కోసం సిద్ధమయ్యారు. స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం నాని సూపర్ స్టైలిష్ మేకోవర్ అయ్యారు. తాజాగా పూర్తయిన ఈ ఫోటోషూట్ విశేషాలు మరియు సినిమా అప్డేడేట్స్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో 'రన్ రాజా రన్', 'సాహో', 'ఓజీ' వంటి చిత్రాలతో తనదైన స్టైలిష్ మేకింగ్‌తో ఆకట్టుకున్న దర్శకుడు సుజీత్, ఈసారి నాని లుకు పూర్తిగా రీఇన్వెంట్ చేశారు. ఈ సినిమా కోసం నాని తన హెయిర్ స్టైల్‌ను మార్చడంతో పాటు క్రేజీ ట్రెండీ స్పెక్స్ ధరించి సరికొత్త గ్లామరస్ అండ్ రఫ్ గా కనిపించనున్నారు. ఇక మేకర్స్ ఇప్పటివరకు నాని పూర్తి లుక్‌ను బయటకు వదలకుండా కేవలం గ్లింప్స్ తోనే ప్రేక్షకుల్లో అంచనాలను విపరీతంగా పెంచేశారు. గత రెండేళ్లుగా 'ది ప్యారడైజ్' షూటింగ్ లో బిజీగా ఉన్న నాని, ఇప్పుడు ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా 'బ్లడీ రోమియో' సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. అక్టోబర్ 16 లేదా 17 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్లోనే కొన్ని అత్యంత కీలకమైన యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించేందుకు సుజీత్ అండ్ టీమ్ పక్కా ప్లాన్‌తో సిద్ధమయ్యారు.