రష్యా ల్యాబ్లో గుర్తుతెలియని ఇన్ఫెక్షన్..
ఒకరు మృతి.. వందలమంది క్వారంటైన్
న్యూఢిల్లీ : రష్యాలో కొత్త ఇన్ఫెక్షన్ భయాలు చెలరేగాయి. సైబీరియాలోని ఓ పరిశోధన కేంద్రంలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్ తెలియని ఇన్ఫెక్షన్తో మరణించడంతో, అధికారులు ముందు జాగ్రత్త చర్యగా వందల మందిని క్వారంటైన్లో ఉంచారు. అమెరికా విదేశాంగ శాఖ ఈ వార్తపై స్పందించింది. ఈ ఇన్ఫెక్షన్/ వ్యాధి గురించి కచ్చితమైన సమాచారాన్ని వెంటనే విడుదల చేయాలని మాస్కోను కోరింది. అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ, ఆగ్నేయ సైబీరియాలో వెలుగుచూసిన ఈ ఇన్ఫెక్షన్ వ్యాధి గురించి తమకు సమాచారం ఉందని అన్నారు. ఈ పరిస్థితిని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాల(సీడీసీ)తో పాటు ఇతర సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి డాన్ హాఫ్? మెన్ మాట్లాడుతూ, ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అమెరికా గూఢచార యంత్రాంగం సేకరిస్తున్నట్లు తెలిపారు. సైబీరియాలోని యాంటీ-ప్లేగ్ పరిశోధన కేంద్రంలో ఇటీవల ఓ ప్రమాదం జరిగినట్లు సీఎన్ఎస్ వార్త సంస్థ నివేదించింది. ఆ తర్వాత అక్కడ పనిచేసిన ఒక ల్యాబరేటరీ టెక్నీషియన్ తెలియని ఇన్ఫెక్షన్తో మరణించారు. ఇర్కుట్స్ సమీపంలోని షెలెబోవ్లో ఉన్న యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్లో ఈ ఘటన జరిగిందని రష్యా ప్రభుత్వ వార్త సంస్థ లాన్ పేర్కొంది. మరోవైపు అంటువ్యాధుల పర్యవేక్షణ సంస్థ రోస్పోట్రెబ్నాడోర్? దీనిపై కీలక విషయాలు వెల్లడించింది. నదరు ఉద్యోగి మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పేర్కొంది. అతనికి న్యుమెనియా లాంటి లక్షణాలు మాత్రం కనిపించాయని, అయితే ఆ వ్యాధి లేదా ఇన్" ఫెక్షన్ ఏమిటో ఇంకా నిర్ధరణ చేయాల్సి ఉందని పేర్కొంది. ఇర్కుట్స్త్కో, షెలెబోవ్ నగరాల్లో పారిశుద్ధ్యం లేక అంటువ్యాధులు బాగా ప్రబలుతున్నాయని రోస్పోబ్నాడ్జోర్ పేర్కొంది. ఏది ఏమైనపప్పటికీ, ల్యాబ్ ఉద్యోగి మృతి కేసులో తాము ప్రత్యేక ప్రోటోకాల్? ను అమలు చేస్తున్నట్లు తెలిపింది. అయితే న్యూమోనిక్ ప్లేగ్ సంభవించి ఉండవచ్చనే ఆందోళనలు చెలరేగాయి. మరణించిన ల్యాబ్ టెక్నీషియన్ ఒక 28 ఏళ్ల మహిళ అని, ఆమె బహుకా ప్లేగ్ వ్యాధితో మరణించి ఉంటుందని బురియాటియా రిపబ్లిక్ నాయకుడు అలెక్సీ సిడెనోవ్ పేర్కొన్నారు. ప్లేగ్ వ్యాధి వ్యాపిస్తోందని వార్తల నేపథ్యంలో, ప్రధాన వైద్యాధికారులతో స్థానిక అంటువ్యాధుల నివారణ మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత ఇర్కుట్స్ గవర్నర్ ఇగోర్ కోల్డెన్ మాట్లాడుతూ, ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రశాంతంగా ఉండాలని కోరారు. షెలెఖోవ్ పరిసర ప్రాంతాల్లో అదనపు భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని చెప్పారు. మరోవైపు ఇన్ఫెక్షన్ ప్రబలిన వరిశోధన కేంద్రానికి సమీపంలో ఉన్న అల్యూమినియం కర్మాగారం తమ సిబ్బందిని ముఖానికి మాన్కులు ధరించాలని ఆదేశించింది. సదరు కర్మాగారం అధిపతి ఆర్టెమ్ ఫోమినిఖ్ మాట్లాడుతూ, ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తిపై దేశంలో ఊహాగానాలు, రూమర్లు, వరస్పర విరుద్ధంగా ఉన్న నివేదికలు ప్రచారంలో ఉన్నాయని అన్నారు. ప్రజలు వాటిని నమ్మవద్దని, ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు మరణించిన ల్యాబ్ టెక్నీషియన్ తో సన్నిహితంగా ఉన్న వారందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉ ంచారని, ప్రస్తుతం వారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదని ఆయన అన్నారు.