2,610కు చేరిన క్వింటా గోధుమలు
రబీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
దిల్లీలో ట్రాఫిక్ పరిష్కారానికి చర్యలు
ఏఐ సాయం తీసుకుంటామని వెల్లడి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా రబీ పంటలకు సంబంధించి 2027-28 సీజన్‌కు మద్దతు ధరను నిర్ణయించింది. గోధుమలు, బార్లీ, శనగలు, ఆవాలు, పొద్దుతిరుగుడు (కునుమ), మనూర్ (కందులు/చిరుధాన్యాల రకం) పంటల కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. గోధుమలపై క్వింటాలుకు రూ.25 పెంచారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. కనీస మద్దతు ధరలో అత్యధికంగా కునుమ పంటకు క్వింటాలుకు 7675 చొప్పున పెంపుదల చేశారు. ఆ తర్వాత రేపే సీడ్, ఆవాలకు క్వింటాలుకు 2413 చొప్పున పెంచారు. మనూర్ వంటకు క్వింటాలుకు 7390, బార్లీకి (జౌ) క్వింటాలుకు ?136, శనగలకు క్వింటాలుకు 783, గోధుమలకు క్వింటాలుకు 25 చొప్పున పెంచారు. ఢిల్లీ ట్రాఫిక్ నిర్వహణను మెరుగు చేయడం కోసం 'ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్' తీసుకురావాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 1,529 ట్రాఫిక్ సిగ్నల్స్ స్థిరమైన మ్యాన్యువల్ పద్ధతిలో ఉన్నాయి. అయితే 'ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ సిగ్నల్స్ ట్రాఫిక్ రద్దీకి తగ్గట్లుగా సిగ్నల్ సమయాన్ని అవే అడ్జస్ట్ చేసుకుంటాయి. దీనిని మూడు విడతలలో (ఫేజ్‌లలో) అమలు చేయనున్నామని తెలిపారు. వేర్వేరు కారిడార్లలో వేర్వేరు సమయాల్లో ఈ వద్దతిని అమలు చేస్తారు. ఇందుకోసం కేంద్రం 1,790 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని తెలిపారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌తో కలిపి రైన్యూవబుల్ ఎనర్జీ సరఫరా చేయడం కోసం 1.86 లక్షల కోట్ల అంచనాతో కూడిన 'గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్ xXx' పథకానికి కూడా మోదీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో శాస్త్రీయ పరిశోధనలు, వినూత్న ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 'పీఎం ధార' పథకాన్ని తీసుకొచ్చింది. రూ.1,86,405 కోట్లను ఈ పథకానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక, నూనె గింజల విషయానికొస్తే ఆవాల మద్దతు ధర క్వింటాలుకు రూ.6,200 నుంచి రూ.413 పెరిగి రూ. 6,613కి చేరిందని అశ్వినీ వైష్ణవ్' పేర్కొన్నారు. అలాగే కుసుమలధర గత ఏడాది ఉన్న క్వింటాలుకు రూ. 6,540 నుంచి రూ.675 పెరిగి రూ.7,215కి చేరిందన్నారు. 2027-28 మార్కెటింగ్ సంవత్సరంలో 324 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించి రైతులకు చెల్లించే మొత్తం విలువ రూ. 90,962 కోట్లుగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ సిఫార్సుల ఆధారంగా, ఉత్పత్తి వ్యయం, 'ఎల్ నినో' ప్రభావంపై ఆందోళనలు, అలాగే అంతర్జాతీయ, దేశీయ ధరల పోకడలను పరిగణనలోకి తీసుకుని ఆరు రకాల రద్దీ వంటలకు కనీస మద్దతు ధర ను వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. 2026-27 వంట సంవత్సరానికి (జులై-జూన్) గోధుమల ఉత్పత్తి లక్ష్యాన్ని వ్యవసాయ శాఖ 121 మిలియన్ టన్నులుగా నిర్దేశించింది. గోధుమ అనేది ప్రధాన రబీ (శీతాకాలవు) వంట. సాధారణంగా అక్టోబర్‌లో విత్తనాలు చల్లడం, ఏప్రిల్‌లో వంట కోత ప్రారంభమవుతాయి.