నేరుగా సెమిస్ కు టీమిండియా
ఆసియా క్రీడల్లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన రెండో క్వార్టర్ ఫైసల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో మెరుగైన స్థానంలో ఉన్న టీమిండియా నేరుగా సెమీఫైనల్సు అర్హత సాధించింది. కరోగి స్పోర్ట్స్ పార్స్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా పర్షం కురపడంతో టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఉదయం 5:30 గంటలకు జరగాల్సిన పాకిస్థాన్- హాంకాంగ్ తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే కారణంతో రద్దయింది. ఆ మ్యాచ్లోనూ అధిక ర్యాంకింగ్ ఆధారంగా పాకిస్థాన్ సెమీనక్కు చేరుకుంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో భారత్ నంబర్ స్థానంలో ఉ ండగా.. ఆఫ్ఘనిస్థాన్ 10వ స్థానంలో ఉంది. మరోవైపు పాకిస్థాన్ 6వ ర్యాంకులో, హాంకాంగ్ 24వ ర్యాంకులో కొనసాగుతున్నాయి. ఈ నిబంధనల ప్రకారమే భారత్, పాక్ జట్లు ముందంజ వేశాయి. సెమీఫైనల్లో శ్రీలంక, నేపాల్ మధ్య జరిగే మూడో క్వార్టర్ ఫైసల్ విజేతతో భారత్ తలపడుతుంది. మరో సెమీస్ లో బంగ్లాదేశ్, మలేషియా మధ్య జరిగే నాలుగో క్వార్టర్ ఫైనల్ విజేతతో పాకిస్థాన్ పోటీ పడుతుంది. మిగిలిన క్వార్టర్ ఫైసల్స్ మంగళవారం, సెమీ ఫైనల్స్ గురువారం జరగనున్నాయి.