డాటర్స్ డే సందర్భంగా బాలీవుడ్ నటి కృతి ననన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఓ భావోద్వేగ పోస్ట్ నెట్టింట ఆలోచింపజేస్తోంది. దేశంలో మహిళలు, బాలికలపై వరుసగా జరుగుతున్న లైంగిక వేధింపులు, దాడుల ఘటనల నేపథ్యంలో స్పందించారు. మహిళల జీవితాల్లో భయం అనేది ఎందుకు? సాధారణ భాగమైపోయింది? అని నిలదీశారు. ఈ ప్రత్యేక దినాన శు భాకాంక్షలు చెప్పడానికే పరిమితం కాకుండా ఆడపిల్లల రక్షణపై సమాజాన్ని ప్రశ్నించడమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఆడపిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ స్వేచ్ఛగా జీవించాల్సిన వాతావరణం పోయి ప్రతి అడుగులోనూ భయంతో బతకాల్సి రావడం పట్ల కృతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నంధ్యా సమయం దాటితే బయటకు వెళ్లాలన్నా? ఒంటరిగా ప్రయాణించాలన్నా నగరాల్లో భయం గుప్పెట్లో బతకాల్సిన పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. డాటర్స్ డే నాడు నమాజం ఆడపిల్లలను ప్రేమించడం మాత్రమే కాదు. వారికి భయం లేని సురక్షిత వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందనే సందేశాన్ని ఇచ్చారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో మైనర్ బాలికలు, మహిళలపై జరిగిన దారుణ లైంగిక దాడి ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. విద్యార్థినులు, మహిళా సంఘాలు రోడ్లపైకి వచ్చి భద్రత కోసం నిరసనలు తెలుపుతున్న తరుణంలో కృతి నసన్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరిం చుకున్నాయి. కఠిన చట్టాలు తీసుకురావడమే కాకుండా, సమాజంలో స్త్రీల పట్ల ఉన్న దృక్పథంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మగపిల్లల పెంపకం విషయంలో సమాజం తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఈ సందర్భంగా కృతి ఎత్తిచూపారు. ఆడపిల్లలకు ఎల్లప్పుడూ జాగ్రత్తలు, వరిమితులు నేర్పించడం కంటే మగపిల్లలకు చిన్నతనం నుంచే వారి భద్రత పట్ల బాధ్యతగా ఉండటం నేర్పించడం అంతకంటే ముఖ్యమని నొక్కిచెప్పారు. భయం అనేది మహిళలను గౌరవించడం.. ఆడపిల్లల హక్కులను, ఆశయాలను కాలరాసేలా మారకూడదని ఆకాంక్షించారు.