2027 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆడతారా? వయను మీద పడుతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు సీనియర్ల ఎంపికపై కొంతకాలంగా చర్చ సాగుతోంది. అయితే, వయసు ఒక్కటే ఆటగాడి ఎంపికకు ప్రాతిపదిక కాకూడదని బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాన్ స్పష్టం చేశారు. ఫిట్నెస్, ప్రదర్శనే కీలకమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, సమీబియా వేదికలుగా ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే.
ఫిట్నెస్, ప్రదర్శనకే ప్రాధాన్యం
ప్రపంచకప్ జట్టు ఎంపికపై బీసీసీఐ నేరుగా వ్యాఖ్యానించలేదని మన్హాన్ తెలిపారు. తుది నిర్ణయం సెలెక్టర్లు, కోచ్‌లదేనని చెప్పారు. అయి-తే, తన అభిప్రాయం ప్రకారం ఆటగాడి ఫిట్నెస్, మైదానంలో ప్రదర్శనే ఎంపికకు ప్రామాణికాలని స్పష్టం చేశారు. జట్టు కోసం ఆడుతూ విజయాలు అందించే సత్తా ఉంటే వయసును అడ్డంకిగా అభిప్రాయపడ్డారు. చూడకూడదని
గిలకు సీనియర్ల అండ
వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కోహ్లి, రోహిత్, హార్దిక్ పాండ్యా వంటి అనుభవజ్ఞుల సహకారం ఎంతో ఉపయోగపడుతుందని మన్హాస్ అన్నారు జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లు బౌ లింగ్ విభాగానికి నాయకత్వం వహించగలరని పేర్కొన్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ బాధ్యతలను సమర్థంగా పంచుకోవడం జట్టుకు మేలు చేస్తుందని చెప్పారు. ఒత్తిడిలో కీలక సందర్భాల్లో సత్తా చాటిన ఆటగాళ్లు జట్టులో ఉండటం మంచి కలయిక అని అభిప్రాయపడ్డారు.
బౌలింగ్, ఫీల్డింగే కీలకం: కైఫ్
మాజీ భారత బ్యాటర్ మహమ్మద్ కైఫ్ సైతం ప్రపంచకప్‌పై తన అభిప్రాయాలను వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో పిచ్‌లు గతంతో పోలిస్తే బ్యాటింగ్‌కు అనుకూలంగా మారాయని చెప్పారు. ఈ నేపథ్యంలో బౌలింగ్ విభాగం నాణ్యతే విజయాన్ని నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. భారత్ ప్రపంచకప్ గెలవాలంటే బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలను పటిష్టం చేసుకోవాలని సూచించారు. కోహ్లి, రోహిత్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.