దివంగత లెజెండరీ నటి శ్రీదేవి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ చిన్న కుమార్తె, యంగ్ బాలీవుడ్ బ్యూటీ ఖుషీ కపూర్ తాజాగా షేర్ చేసిన పిక్స్ ఇంటర్నెట్లో వివరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. మోడ్రన్ పింక్ గౌనులో దేవకన్యలా మెరిసిపోతూ ఆమె ఇచ్చిన పోజులు నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. అక్క జాన్వీ కపూర్ బాటలోనే గ్లామరస్ లుక్స్ అలరిస్తున్న ఈ చిన్నది, తాజాగా వంచుకున్న లగ్జరీ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచి ఫ్యాన్స్ మనసులను దోచేస్తున్నాయి.. తాజా ఫోటోషూట్ కోసం ఖుషీ కపూర్ ప్రసిద్ధ డిజైనర్ 'మనీష్ మల్హోత్రా' కౌచర్ లైన్‌కు చెందిన 'సాఫ్ట్ పింక్ టెక్సర్డ్ కార్సెట్ గౌన్'ను ఎంచుకుంది. ఇక స్ట్రక్చర్డ్ కార్సెట్ బోడిస్, ఫ్లోరింగ్ డ్రేవ్స్ ఉన్న ఈ అవుట్‌ఫిట్ ఆమెకు కంటెంపరరీ ఫేరీ-ప్రిన్సెస్ లుక్‌ని తెచ్చిపెట్టింది. పింక్ షేడ్‌లో ఎంతో క్లాసీగా ఉన్న ఈ డ్రెస్‌లో ఖుషీ ఎంతో గ్లామరస్ గా మెరిసిపోయింది. ఈ లగ్జరీ పిక్స్ షేర్ చేస్తూ ఖుషీ కపూర్ "నాకిష్టమైన గౌనులో ఫీరీ ప్రిన్సెస్ డ్రీమ్స్ ను ఆస్వాదిస్తున్నా" అంటూ స్పెషల్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అవ్వగా, అభిమానులు "సో ప్రెట్టీ ఖుషీ", "గోర్జియస్ లుక్", "అచ్చం దేవకన్యలా ఉన్నావ్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తూ లైకులతో ముంచెత్తుతున్నారు.