భారతీయులకు ఉద్యోగాలొచ్చాయి..
అమెరికా సంపద పెరిగింది వరస్పరం ప్రయోజనం పొందాం..
ఆ విషయాన్ని గుర్తించండి భారతీయ ఐటీ కంపెనీలను పెర్మ్ నుంచి
అమెరికా సస్పెండ్ చేయడంపై భారత్ తీవ్ర ఆక్షేపణ
వాషింగ్టన్: తమ ఉద్యోగులకు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పించే 'పర్మినెంట్ లేబర్ 'సర్టిఫికేషన్ ప్రోగ్రామ్' (పెర్న్) నుంచి అంతర్జాతీయ, భారతీయ ఐటీ దిగ్గజ కంపెనీలను సస్పెండ్ చేస్తూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత్ బండించింది. ఈ తరహా చర్యలు ఇరుదేశాల ఉమ్మడి ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లవని స్పష్టం చేసింది. అమెరికన్లకు అవకాశాలు ఇవ్వకుండా విదేశీ బటీ నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయన్న ఆరోపణలతో ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, క్యాప్ జెమినీ, కాగ్నిజెంట్ కంపెనీలను పెర్మ్ నుంచి అమెరికా నస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం భారత విదేశాంగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. నిపుణులైన భారతీయులు అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేయటం వల్ల భారత్‌కి కాదు, అమెరికాకూ అపారమైన ప్రయోజనాలు కలుగుతున్నాయని గుర్తు చేసింది. 'అమెరికా కంపెనీలు బలోపేతమవుతున్నాయి. అమెరికాలో సంపద పెరుగుతోంది' అని పేర్కొంది. అమెరికాలో పని చేస్తున్న విదేశీ ఉద్యోగులను ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 'ఒప్పంద బానిసలు'గా పేర్కొనటాన్ని కూడా విదేశాంగశాఖ తీవ్రంగా ఆక్షేపించింది. ఇటువంటి వ్యాఖ్యలు సరైనవి కావు. అమెరికాలోని భారతీయ నిపుణులు బాగా చదువుకున్నవాళ్లు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆవిష్కరణల రంగానికి తమ నైపుణ్యాలతో ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నవాళ్లు. తరతరాల వలన ప్రజల శ్రమ, ఆవిష్కరణలతోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది అన్న విషయాన్ని మర్చిపోవద్దు' అని హితవు పలికింది.
మాపై ప్రభావం ఉండదు: టీసీఎస్
పెర్మ్ నుంచి నస్పెండ్ చేయటం వల్ల తమ కంపెనీపై పెద్దగా ప్రభావం ఉండదని టీసీఎస్ ప్రకటించింది. అమెరికాలోని తమ సంస్థల్లో స్థానికులకే ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యమిస్తున్నామని, గత రెండేళ్లలో పెర్క్ నియామకాలు రెండంకెల్లో కూడా లేవని స్పష్టం చేసింది. అమెరికా కార్మికశాఖ జారీ చేసే నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నట్లు పేర్కొంది. అమెరికాలో తమ కంపెనీకి చెందిన 31 కార్యాలయాలు, డెలివరీ సెంటర్లు నడుస్తున్నాయని.. వచ్చే జడేళ్లలో మరో 15 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నామని తెలిపింది. మైక్రోసాఫ్ట్ కూడా తాజా పరిణామంపై స్పందిస్తూ.. అమెరికాలోని తమ ఉద్యోగుల్లో మెజారిటీ అమెరికన్లనని వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వానికి తాము సమర్పించిన 6వేల హెచ్-1బీ వీసా దరఖాస్తుల్లో 20 శాతం మాత్రమే కొత్త వారివని స్పష్టం చేసింది. కాగా, వాన్స్ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు తిరిగి ఇండియాకు వచ్చేయాలని జోహో సంస్థ వ్యవస్థాపకుడు శ్రీధర్ పిలుపునిచ్చారు.