ఈస్ట్ జోను 584 పరుగుల భారీ ఆధిక్యం
దులీప్ ట్రోఫీ ఫైనల్ పై పట్టు బిగించిన ఈస్ట్ జోన్
విధ్వంసక హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్
ఒక్క పరుగు తేడాతో సెంచరీ కోల్పోయిన తిలక్ వర్మ
సౌత్ జోన్ పై 584 పరుగుల భారీ ఆధిక్యంలో ఈస్ట్ జోన్
రెండో ఇన్నింగ్స్ లోనూ రాణించి టైటిల్ ను ఖాయం చేసుకున్న ఈస్ట్
దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్‌పై ఈస్ట్ జోన్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి తన పట్టును మరింత బిగించింది. చెన్నైలోని ఎంపి చిదంబరం స్టేడియం వేదికగా బుధవారం జరిగిన నాలుగో రోజు ఆటలో, కెప్టెన్ ఇషాన్ కిషన్ (80), శిఖర్ మోహన్ (52) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ ఏకంగా 584 పరుగుల భారీ ఆధిక్యం సాధించి, టైటిల్‌ను దాదాపు ఖాయం చేసుకుంది.
ఇషాన్, మోహన్ అద్భుత భాగస్వామ్యం
తొలి ఇన్నింగ్స్ 372 వరుగుల భారీ ఆధిక్యం ఉ న్నప్పటికీ, ఈస్ట్ జోన్ ఫాలో ఆన్ విధించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే, ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (8), అభిమన్యు ఈశ్వరన్ (0) విఫలమవడంతో ఆరంభంలో తడబడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, శిఖర్ మోహన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 170 బంతుల్లో 126 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ తనదైన శైలిలో విధ్వంనక బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 98 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. విజయ్ వేసిన ఒకే ఓవర్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 20 పరుగులు రాబట్టి స్కోరు బోర్డును వరుగులు పెట్టించాడు. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి కిషన్ ఔటవగా, నిలకడగా ఆడిన శిబర్ మోహన్ (52) కూడా పెవిలియన్ చేరాడు.
ఒక్క వరుగుతో శతకం చేజార్చుకున్న తిలక్ వర్మ
అంతకుముందు, ఉదయం సెషన్లో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌత్ జోన్ 336 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తిలక్ వర్మ అద్భుత పోరాట పటిమ కనబరిచాడు అయితే, దురదృష్టవశాత్తూ ఒక్క పరుగు తేడాతో తన తొమ్మిదో ఫస్ట్ క్లాస్ సెంచరీని చేజార్చుకున్నాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కౌనైన్ ఖురేషీ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. మరో ఎండ్‌లో సీవీ మిలింద్ (43) అతనికి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరి నిష్క్రమణ తర్వాత సౌత్ జోన్ ఇన్నింగ్స్ త్వరగా ముగిసింది. ముఖేష్ కుమార్ 3 వికెట్లతో రాణించాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కుమార్ కుశాగ్ర (36 నాటౌట్), బురేష్ (26 నాటౌట్) క్రీజులో ఉన్నారు. చివరి రోజు ఆట నామమాత్రమే కాగా, ఈస్ట్ జోన్ విజయం లాంఛనమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.