ఒప్పందాలే కాదు.. ఉత్పత్తి ప్రారంభం కావాలి
రాష్ట్రంలో సెమీకండక్టర్ తయారీ ఎకోసిస్టమ్
అభివృద్ధి కావాలి పశ్చిమ, తూర్పు దేశాలను
అనుసంధానించేలా మన పోర్టులు ఎస్ఐపీబీలో
ముఖ్యమంత్రి. చంద్రబాబు దిశానిర్దేశం ఇప్పటివరకు
714 ఒప్పందాల్లో 519 ప్రాజెక్టుల కార్యాచరణ ఎన్నికల
కోడ్ వల్ల పెట్టుబడుల వివరాలు వెల్లడించని ప్రభుత్వం
అమరావతి, : రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్లో పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్లో ప్రభుత్వంతో సహా ప్రైవేటు భాగస్వామ్యంలోనూ భారీగా పెట్టుబడులు వచ్చేలా పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు పెట్టుబడులుగా మారి ఉత్పత్తి ప్రారంభించే అంశంపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 22వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు లోకేశ్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నారాయణ, కందుల దుర్గేశ్ వర్చువల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలు, ఇంధన శాఖ, పర్యాటక శాఖ, ఐటీ ఎలక్ట్రిట్రనిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్ఐపీటీ అమోద ముద్ర వేసింది. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో.. ఏయే ప్రాంతాలకు ఎంతెంత పెట్టుబడితో పరిశ్రమల ప్రతిపాదనలకు ఆమోదం లభించిందన్న వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన 714 ఒప్పందాల్లో 519 ప్రాజెక్టుల కార్యాచరణ ప్రారంభమైనట్టు అధికారులు సీఎంకు తెలిపారు. కాగా... వచ్చే నెలలో విశాఖలో నిర్వహించనున్న పారిశ్రామిక పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు కోసం అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ను సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. సెమీకండక్టర్ రంగంలో తయారీ యూనిట్లతో కూడిన ఎకోసిస్టమ్ రాష్ట్రంలో ఏర్పాటు కావాలని సీఎం అకాంక్షించారు.
రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పోర్టులు అభివృద్ధి చేయాలి
లాజిస్టిక్స్ రంగంలోనూ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా పోర్టులు, ఎయిర్ పోర్టులతోపాటు తూర్పు, పశ్చిమ దేశాలకు కనెక్టివిటీని పెంచడంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పోర్టు డెవలప్మెంట్ విధానాన్ని అమలు చేయాలని మౌలిక సదుపాయాల కల్పన శాఖను ఆదేశించారు. పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో ఓడరేవులు ప్రాధాన పాత్రను పోషిస్తాయని అన్నారు. గ్లోబల్ స్థాయిలో పశ్చిమ, తూర్పు దేశాలను అనుసంధానం చేసేలా రాష్ట్రంలో ఓడరేవులను అభివృద్ధి చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని ఉత్పత్తులను విదేశాలకు నేరుగా ఎగుమతి చేసేలా ఓడరేవులు ఉండాలని, దానికి అనువుగా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని అన్నారు. దీనికి తగ్గ కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. ప్రధానంగా వ్యవసాయ, ఉద్యానవన ఉ త్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలైన పాలసీని రూపొందించాలన్నారు. ఇందుకోసం ఈ రంగాల్లో నిష్ణాతులైన కన్సల్టెట్లను నియమించుకోవాలని సూచించారు.
నౌకా మరమ్మతు కేంద్రాలకు ప్రోత్సాహం
నౌకాశ్రయాల్లో చర్యలు చేపట్టేందుకు మౌలిక సదుపాయాల కల్పన శాఖ సిద్ధమైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు భారీ నౌకాశ్రయ నిర్మాణాలను చేపడుతున్న అ శాఖ.. ఇరపై నౌరా తయారీ, మరమ్మతు కేంద్రాలనూ ప్రోత్సహించాలని భావిస్తోంది. భారీ నౌకల మరమ్మతు పనులకు చాలా సమయం పడుతుంది. అప్పటిదాకా వాటిని ఓడరేవు బెర్త్ ల్లోనే పార్కింగ్ చేసేందుకు భారీ మొత్తాలను చెల్లించాల్సి వస్తోంది. ఈ వ్యయాన్ని తగ్గించేందుకు రాష్ట్రంలోని నౌకాశ్రయాల్లోనే కొన్ని బెర్తులను రిపేరు కోసం కేటాయించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు నౌకాయాజమాన్యాలకు వ్యయం తగ్గుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టులను టెండరు ప్రక్రియ ద్వారా పూర్తిగా అప్పగించకుండా. లీజులకు ఇవ్వడంపైనా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది.
సీఎంతో పవన్ భేటీ
వైసీపీ 'స్థానిక' అరాచకాలు, కోర్టు వివాదాలపై చర్చ సీట్ల సర్దుబాటు రాజీనామా వార్తపైనా. ఓ. అరగంటపాటు ఉభయుల సమావేశం
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతల అరాచకాలు, సుప్రీంకోర్టు తీర్పు. మున్సిపల్ అభ్యర్థుల తుది జాబితా తాత్కాలిక నిలుపుదల తదితర అంశాలపై చర్చించారు. గురువారం ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన పవన్ అరగంట అయనతో భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికల్లో కొన్ని చోట్ల కూటమి పార్టీల నడుమ సీట్ల సర్దుబాటు, సీట్ల రిజర్వేషన్లపై స్వల్ప విభేదాలు తలెత్తాయి. వాటిపై తమకు సమాచారం ఇవ్వలేదని జనసేన నేతలు సీఎం వద్దే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం, డిప్యూదీ సీఎం సమావేశమయ్యారు. ఎన్నికల అంశాలతోపాటు డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపైనా ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. వాస్తవానికి స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిర్ణయంపై కూటమి పార్టీల అగ్రనేతలు బుధవారం రాత్రే సంయుక్త ప్రకటన విడుదల చేశారు.