600 మంది మహిళలకు ఉపాధి లక్ష్యం
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
మాకవరపాలెం, : గిరిజన రైతులు పండించే అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో మరింత గుర్తింపు తీసుకురావడంతోపాటు స్థానికంగా ఉపాధి అపకాశాలను పెంపొందించే లక్ష్యంతో సెట్టిపాలెంలో సమీకృత కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు మంగళవారం శ్రీకారం చుట్టారు. మండలంలోని సెట్టిపాలెం గ్రామంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సర్సీపట్నాన్ని పరిశ్రమల హబ్ గా తీర్చిదిద్దడమే తన సంకల్పమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పండే అరకు కాఫీకి విదేశాల్లోనూ ఆదరణ ఉందని, అయినప్పటికీ ఆ ఉత్పత్తులకు తగిన స్థాయిలో మార్కెటింగ్ జరగడం లేదన్నారు. సెట్టిపాలెంలో ఏర్పాటు చేయనున్న ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా కాఫీని శుద్ధి చేసి, నాణ్యమైన ఉత్పత్తులుగా తయారు చేసి ప్రపంచ మార్కెట్‌కు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. విశాఖపట్నం గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో 11.08 ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో కాఫీ క్యూరింగ్, రోస్టింగ్, బ్లెండింగ్ సదు-పాయాలు ఉంటాయన్నారు. గంటకు నాలుగు టన్నుల కాఫీ గింజలను క్యూరింగ్ చేసే సామర్థ్యంతోపాటు, గంటకు 100 కిలోల రోస్టెడ్, బ్లెండెడ్ కాఫీ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుందని పేర్కొన్నారు. ఏటా సుమారు 3,000 మెట్రిక్ టన్నుల కాఫీ గింజలను ప్రాసెస్ చేయడం, 100 మెట్రిక్ టన్నుల రోస్టెడ్, బ్లెండెడ్ కాఫీని ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. నిర్మాణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేసి, 2027 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. కర్మాగారం ఏర్పాటుతో సుమారు 600 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అయ్యన్నపాత్రుడు తెలిపారు. పరిశ్రమ కోసం భూములిచ్చిన నిర్వాసితులకు కూడా ఇక్కడే ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ యూనిట్ ద్వారా గిరిజన రైతులు వండించే అరకు వ్యాలీ కాఫీకి విలువ జోడించడంతోపాటు, దేశీయంగా, అంతర్జాతీయంగా మార్కెట్ విస్తరించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో రవాణా నదు-పాయాలను మెరుగుపరిచేందుకు రాచపల్లి నుంచి ఎలమంచిలి వరకు వంద అడుగుల రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు స్పీకర్ వెల్లడించారు. దీంతో పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతమై భూముల విలువ పెరిగే అవకాశం ఉ ందన్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి, నభావతి అయ్యన్నపాత్రుడికి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కల్యాణ్ సహకారంతో గిరిజన ప్రాంతాలకు రహదారి సదుపాయాలు కల్పిస్తున్నామని, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆమె పేర్కొన్నారు. జీసీసీ చైర్మన్ కిడారి శ్రాపణ్కుమార్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో వాతాపరణ పరిస్థితులు, రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని మైదాన ప్రాంతమైన నర్సీపట్నం సమీపంలోనే కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం ప్రయోజసకరమని తెలిపారు. జీసీసీ ఎండీ శోఖిక మాట్లాడుతూ, అరకు కాఫీ రాష్ట్రానికి గర్వకారణమని, ఈ కర్మాగారం ద్వారా కాఫీ ఉత్పత్తుల విలువ పెరగడంతోపాటు మార్కెట్ అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ, నిర్మాణ పసులను సకాలంలో పూర్తి చేసేలా జీసీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని, స్థానికులకు ఉపాధి కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్సీపట్నం టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి సూర్యచంద్ర, సెట్టిపాలెం మాజీ సర్పంచి అల్లు రామనాయుడు, నందకిషోర్, జీసీసీ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.