స్వదేశంలో వెస్టిండీస్ తో జరగనున్న పన్డే, టీ20 సిరీస్ తో పాటు, ఇరానీ కప్ కోసం జట్లను భారత పురుషుల సెలక్షన్ కమిటీ బుధవారం ప్రకటించింది. ఈ సిరీస్‌ల కోసం పలువురు యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తూ, కెప్టెన్సీలో కూడా కీలక మార్పులు చేసింది. వన్డే జట్టుకు యువ సంచలనం శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, టీ20 జట్టు వగ్గాలను శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించారు. వెస్టిండీస్ తో పన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు చోటు దక్కింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తెలుగు ఆటగాడు. నితీశ్ కుమార్ రెడ్డితో పాటు గుర్నూర్ బ్రార్, అకిబ్ సబీ వంటి కొత్త ముఖాలకు ఈ జట్టులో అవకాశం లభించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో యువ జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ వైన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ వంటి యువ ప్రతిభావంతులకు ఈ జట్టులో చోటు కల్పించారు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. మరోవైపు, రంజీ ట్రోఫీ ఛాంపియన్ జమ్మూ కాశ్మీర్ జరిగే ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ నాయకత్వం వహించనున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో పలువురు దేశవాళీ స్టార్లు చోటు దక్కించుకున్నారు.
ఆసియా క్రీడల జట్టులో మార్పులు
గాయం కారణంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జపాన్ టీ20, ఆసియా క్రీడలకు దూరమయ్యాడు. అతని స్థానంలో విప్రాజ్ నిగమ్‌ను ఎంపిక చేశారు. తొలుత ఆసియా క్రీడల జట్టులో ఉన్న నితీశ్ కుమార్ రెడ్డిని, వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కు ఎంపిక చేయడంతో ఆసియా క్రీడల నుంచి తప్పించారు.
వివిధ జట్ల వివరాలు: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహ్మద్ సిరాజ్, అకిబ్ నబీ, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్,
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కు భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ నుందర్, రవి బిష్ణోయ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్,
జపాన్ టీ20, ఆసియా క్రీడలకు భారత జట్టు (అప్డేడేటెడ్):
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీవర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యళ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్.