ఆసియా క్రీడలు 2026లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆర్చరీలో నేడు భారత్‌కు స్వర్ణాల పంట పండింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్లో చైనాను చిత్తు చేసి టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఈ క్రమంలో దక్షిణ కొరియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కూడా నమం చేసింది. అదే జోరులో కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కూడా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. సాహిబ్ జాదవ్, చికితా తానివర్తి జోడీ స్వర్ణం గెలిచింది. ఈ విజయంతో లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్క అర్హత కూడా సాధించి భారత్‌కు రెట్టింపు ఆనందాన్ని అందించింది. ఇతర క్రీడల్లోనూ భారత క్రీడాకారులు సత్తా చాటారు.. మహిళల స్క్వాష్‌లో తన్వి ఖన్నా అనహత్ సింగ్ తో కూడిన జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లి మరో పతకాన్ని ఖాయం చేసింది. అథ్లెటిక్స్ ఈవెంట్లు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి రెజ్లర్లు, బాక్సర్లు, ఆర్చర్లపైనే ఉంది. హాకీలో భారత మహిళల జట్టు ఫైనల్లో స్థానం కోసం దక్షిణ కొరియాతో తలపడనుంది. స్టార్ జూడోకా అస్మితా దేయ్ కూడా బరిలోకి దిగనుంది. నిన్న మహిళల ట్రాప్ వ్యక్తిగత స్వర్ణం గెలిచిన నీరూ దండా, నేడు మిక్స్డ్ టీమ్ క్వాలిఫికేషన్, టీమ్ ఈవెంట్ పోటీపడనుంది