మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ విజయం
జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనను కొనసాగించింది. హర్మన్ ప్రీత్ కౌర్ (126), అల్రౌండర్ దీప్తి శర్మ (106లి) అద్భుత శతకాలతో చెలరేగడం, ఆ తర్వాత బౌ లర్లు రాణించడంతో భారత్ 121 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్ న్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2.0 తేడాతో కైవసం చేసుకుంది. వడోదర వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ స్మృతి మంధాన (0), షఫాలీ వర్మ (8) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ప్రతీక రావల్ (61)తో కలిసి హర్మన్ ప్రీత్ ఇన్నింగ్స్్ను చక్కదిద్దింది. ఆ తర్వాత దీప్తి శర్మ జత కలవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. హర్మన్ ప్రీత్, దీప్తి శర్మలు జింబాబ్వే బౌలర్లపై పూర్తి అధిపత్యం ప్రదర్శించి శతకాలతో కదం తొక్కారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. 329 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు మంచి అరంథమే లభించింది. 20 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 104 పరుగులు చేసి పోరాడే సంకేతాలు ఇచ్చింది. మువచ్వి (49), తిరిపానో (46) రాణించారు. అయితే, ఆ తర్వాత భారత స్పిన్నర్లు విజృంభించారు. స్పిన్ త్రయం వైష్ణవి శర్మ, దీప్తి శర్మ, శ్రీ చరణి ధాటికి జింబాబ్వే బ్యాటర్లు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయారు. వైష్ణవి శర్మ 4 వికెట్లతో చెలరేగగా, బ్యాటింగ్లో సెంచరీతో మెరిసిన దీప్తి శర్మ బౌలింగ్ లోనూ 3 వికెట్లు పడగొట్టి అల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. దీంతో జింబాబ్వే జట్టు 48.5 ఓవర్లలో 207 పరుగులకు అలౌట్ అయింది.